బీసీ డైరెక్టర్లకు సన్మానం…!!

0
39

Times of Nellore –✒కోట సునీల్ కుమార్✒దేశచరిత్రలో ఏ ముఖ్యమంత్రి కూడా చేయనివిధంగా బి.సి. వర్గాలను ముఖ్యమంత్రి వై.ఎస్. జగన్ మోహన్ రెడ్డి ప్రోత్సహిస్తున్నారని రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి అన్నారు. నెల్లూరు రూరల్ నియోజకవర్గం నుంచి రాష్ట్రస్థాయి బి.సి. కార్పొరేషన్లలో డైరెక్టర్లుగా పదవులు లభించిన అత్తివరపు మల్లేశ్వరి (రజక కార్పొరేషన్), కనకట్లహ్ నరసింహ ముదిరాజ్ (ముదిరాజ్ కార్పొరేషన్), అన్నపరెడ్డి శ్రీదేవి (మోస్ట్ బ్యాక్ వర్డ్ క్లాసెస్ కార్పొరేషన్), రాణిగ్రం కోటి సింగ్, వెండ్లూరు ఉమామహేశ్వరి భాయి (బొందిలి కార్పొరేషన్) మరియు తిరువళ్లూరు దివిజ (విశ్వబ్రాహ్మణ కార్పొరేషన్) 6 మందిని రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, రూరల్ ఎమ్మెల్యే కార్యాలయం ఇంఛార్జ్ కోటంరెడ్డి గిరిధర్ రెడ్డిఅభినందించారు.ఈ సందర్భంగా రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి నెల్లూరు రూరల్ కి 6 డైరెక్టర్ పదవులు వచ్చేదానికి కృషిచేసిన రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జ్ సజ్జల రామకృష్ణా రెడ్డి రాష్ట్ర పార్టీ నాయకులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి, జిల్లా మంత్రి అనిల్ కుమార్ యాదవ్ గారికి, ఇంఛార్జ్ మంత్రి బాలినేని శ్రీనివాసులు రెడ్డి కి కృతజ్ఞతలు తెలిపారు.

SHARE

LEAVE A REPLY