నెల్లూరుజిల్లాలో రేపు కళాశాలల బంద్

0
1161

Times of Nellore ( Nellore ) – కాంట్రాక్ట్ లెక్చరర్స్ చేస్తున్న నిరాహార దీక్షలకు మద్దతుగా రేపు ( గురువారం ) నెల్లూరుజిల్లాలో కళాశాలల బంద్ కు పిలుపునిచ్చాయి అన్నీ విద్యార్ధి సంఘాలు. దీనిపై నెల్లూరులోని సి.పి.ఐ కార్యాలయంలో ఏ.ఐ.ఎస్.ఎఫ్, వైఎస్ఆర్ సిపీ విద్యార్ధి విభాగం, ఎస్ఎఫ్ఐ, ఎన్ఎస్ యుఐ, బిసిఎస్ఎఫ్, పిడిఎస్ యు విభాగం నేతలు రౌండ్ టేబుల్ సమావేశాన్ని నిర్వహించారు. రెగ్యులరైజేషన్ కోసం గడచిన 10 రోజులకు పైగా కాంట్రాక్ట్ లెక్చరర్లు నిరాహార దీక్షలు చేస్తున్నా ప్రభుత్వం స్పందించకపోవడం దారుణమని వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. వారి దీక్షలకు మద్దతుగా రేపు జిల్లాలో కళాశాలల బంద్ చేపట్టాలని నిర్ణయించారు.

అనంతరం వైసీపి విద్యార్ధి విభాగం జిల్లా అధ్యక్షులు శ్రావణ్ మాట్లాడుతూ కాంట్రాక్ట్ లెక్చరర్స్ ను రెగ్యులరైజ్ చేస్తామని ఎన్నికల్లో చంద్రబాబు హామీ ఇచ్చారని గుర్తు చేశారు. అయితే ప్రభుత్వం ఏర్పడు మూడేళ్లు గడుస్తున్నా దానిపై ముఖ్యమంత్రి స్పందించడం లేదని చెప్పారు. కాంట్రాక్ట్ లెక్చరర్స్ దీక్షలకు వైసీపి పూర్తిగా మద్దతు పలుకుతుందని స్పష్టం చేశారు. రేపటి కళాశాలల బంద్ ను అందరూ విజయవంతం చేయాలని శ్రావణ్ పిలుపునిచ్చారు.

SHARE

LEAVE A REPLY