నెల్లూరు ఏ సి స్టేడియం లో బాడ్మింటన్ క్రీడాకారుల ఎంపికలు

0
157

Times of Nellore (Nellore)  #కోట సునీల్ కుమార్ # – నెల్లూరు ఏ సి సుబ్బారెడ్డి స్టేడియం లో ఆంధ్ర ప్రదేశ్ బాడ్మింటన్ అసోసియేషన్ ఆధ్వర్యంలో క్రీడాకారుల ఎంపిక నిర్వహించారు. శాప్ డిప్యూటీ డైరెక్టర్ రామకృష్ణ, ఏ పి బాడ్మింటన్ అసోసియేషన్ నుండి జిలానీ, జిల్లా అకాడమీ జాయింట్ సెక్రటరీ వెంకట్రెశ్వర్లు అద్వర్యం లో ఈ ఎంపికలు జరిగాయి. ఈ సందర్బంగా అకాడమీ జిల్లా అధ్యక్షులు ముక్కాల ద్వారకానాధ్ మాట్లాడుతూ … గత సంవత్సరం రాష్ట్ర వ్యాప్తంగా అకాడమీ విద్యార్థులు అద్భుత ప్రతిభ కనపరిచారన్నారు. వారిలో నుండి 6 గురు బాలురు, నలుగురు బాలికలను ఎంపిక చేయడం జరిగిందన్నారు. ఎంపికైన క్రీడాకారులకు ఉత్తమ శిక్షణ ఇచ్చి రాష్ట్ర , జాతీయ స్థాయిలో రాణించడానికి అన్ని సౌకర్యాలు కల్పించడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో కోచ్ వెంకటేశ్వర్లు, సుధాకర్ రెడ్డి, క్రీడాకారులు పాల్గొన్నారు.

SHARE

LEAVE A REPLY