పాలిటెక్నిక్ కౌన్సిలింగ్ పై నేతాజీ స్కూల్ లో అవగాహన

0
314

Times of Nellore ( Nellore ) – పాలిటెక్నిక్ ప్రవేశ పరీక్షలో ఉత్తీర్ణులైన విద్యార్ధులు కౌన్సిలింగ్ లో సీట్లు కేటాయించుకునే విధానంలో ఇబ్బందులు తలెత్తకుండా, వారికి కౌన్సిలింగ్ విధానంపై పూర్తి అవగాహన కల్పించి పాలిటెక్నిక్ లో ప్రవేశాలు పొందుటకు అల్ – హుదా పాలిటెక్నిక్ కాలేజీ వారిచే ఈ నెల 15వ తేది నుంచి నెల్లూరు శ్రీ నేతాజీ ఎం.ఎస్.ఆర్ విద్యాసంస్థలలో అవగాహన కల్పిస్తున్నారని నేతాజీ సుబ్బారెడ్డి అన్నారు. అల్ – హుదా పాలిటెక్నిక్ కాలేజీ వారు మాట్లాడుతూ.. పాలిటెక్నిక్ అడ్మిషన్స్ కోసం ఈ నెల 17వ తేది నుంచి కౌన్సిలింగ్ ప్రారంభమవుతుందని అన్నారు. మహిళ పాలిటెక్నిక్ కాలేజి, వెంకటేశ్వరపురం ప్రభుత్వ పాలిటెక్నిక్ కాలేజీలలో కౌన్సిలింగ్ జరుగుతుందని పేర్కొన్నారు. ఏ ర్యాంకుల వారు ఏ తేదిలో వెళ్లవలెను అనేది, సీట్లు కోసం ఆప్షన్స్ పెట్టుకునేందుకు వివరాలను నేతాజీ స్కూల్ లో అవగాహన కల్పిస్తున్నామని తెలియజేశారు.

SHARE

LEAVE A REPLY