మ‌లేరియాతో త‌స్మాత్ జాగ్ర‌త్త – అపోలో వైద్యులు డా. దినేష్ రెడ్డి

0
237

Times of Nellore ( Nellore )  – నెల్లూరు నగరంలోని స్థానిక అపోలో స్పెషాలిటీ హాస్పిట‌ల్‌ నందు బుధవారం మలేరియా వ్యాధిపై ప్రముఖ ఫిజిషియ‌న్ డా. దినేష్ రెడ్డి అవగాహనా కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న మాట్లాడుతూ.. ప్ర‌స్తుత వ‌ర్షాకాలంలో ప్ర‌తి ఒక్క‌రూ ప‌రిశుభ్ర‌త‌ను పాటించ‌డంతోపాటూ, దోమ‌లు ఉత్ప‌త్తి చెంద‌కుండా త‌గిన చ‌ర్య‌లు తీసుకోవ‌డం, మ‌రుగు లేకుండా చూసుకోవ‌డం వంటి ముంద‌స్తు జాగ్ర‌త్త‌లు పాటించ‌డం వ‌ల్ల మ‌లేరియా రాకుండా చూసుకోవ‌చ్చ‌న్నారు. ముఖ్యంగా చిన్న‌పిల్ల‌లు, గ‌ర్భ‌వ‌తులు మ‌లేరియా జ్వ‌రం ప‌ట్ల అత్యంత అప్ర‌మ‌త్తంగా ఉండాల్సిన అవ‌స‌రం ఉంద‌న్నారు. మ‌లేరియా దోమ‌లు కుట్టిన త‌రువాత 10 నుంచి 30 రోజుల్లో జ్వ‌రం వ‌స్తుంద‌ని, జ్వ‌రం వ‌చ్చిన వారం రోజుల త‌రువాత వ్యాధి ల‌క్ష‌ణాలు క‌నిపిస్తాయ‌న్నారు. జ్వ‌రం హ‌ఠాత్తుగా రావ‌డం, కీళ్ల నొప్పులు, వాంతులు, త‌ల‌నొప్పి, మ‌గ‌త‌గా ఉండ‌టం, ర‌క్త‌హీన‌త‌, చ‌ర్మం ప‌చ్చ‌గా మార‌డం, ద‌గ్గు, అతిగా చ‌మ‌ట ప‌ట్ట‌డం, అతిగా చ‌లిపుట్ట‌డం, గుండె కొట్టుకునే వేగం త‌గ్గ‌డం వంటి ల‌క్ష‌ణాలు మ‌లేరియా జ్వరాన్ని సూచిస్తాయ‌ని, ఈ ల‌క్ష‌ణాలు క‌నిపించిన వెంట‌నే వైద్యుల‌ను సంప్ర‌దించాల‌ని అన్నారు. నెల్లూరు అపోలో స్పెషాలిటీ హాస్పిట‌ల్‌లో మ‌లేరియా జ్వ‌రం నిర్థారించి, చికిత్స అందించేందుకు అత్యాధునిక ల్యాబ‌రేట‌రీతోపాటూ, ల్యాబ్ టెక్నిషియ‌న్లు, పేతాల‌జిస్టులు, నిపుణులైన వైద్యులు అందుబాటులో ఉన్నార‌ని ఆయన వెల్ల‌డించారు. నెల్లూరు అపోలో స్పెషాలిటీ వైద్య‌శాల‌లో ఉన్న వైద్య సేవ‌ల‌ను స‌ద్వినియోగం చేసుకోవాల‌ని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో ఆసుపత్రి యూనిట్ హెడ్ నవీన్, మెడికల్ సూపరింటెండెంట్ శ్వేతా రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.

SHARE

LEAVE A REPLY