పోట్టెపాళెంలో బాలిక పై అత్యాచారం చేసిన నిందితుడు అరెస్ట్

0
593

Times of Nellore ( Nellore ) – నెల్లూరు నగరంలోని పోట్టెపాళెంలో బాలిక పై అత్యాచారం చేసిన నిందితుడిని రూరల్ పోలీసులు అరెస్టు చేశారు. వివరాల్లోకి వెళ్తే.. పోట్టేపాళెం గ్రామానికి చెందిన అంబూరు రాజమ్మ, లేట్ రమణయ్య కుమార్తె అయిన శాంతి అనే 11 సంవత్సరాల అమ్మాయికి పుట్టుకతోనే కళ్ళు కనిపించవు, మానసికంగా కూడా బలహీనురాలు, గుండె సంబంధించి వ్యాధితో బాధపడుతున్న ఆమె అసహాయతను అదునుగా తీసుకుని తన ఇంటి ముందు కాపురం ఉంటున్న అలిషేర్ (22) అనే వ్యక్తి ఆ అమ్మాయిని తన ఇంటికి పిలిచి అత్యాచారం చేసినందుకు నెల్లూరు రూరల్ పోలీసులు అలిషేర్ ను అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేశారు. తల్లితండ్రులు తమ పిల్లల విషయంలో అత్యంత జాగురుకతతో వ్యవరించాల్సిన అవసరం ఉందని రూరల్ ఎస్ఐ కె.వి రాఘవరెడ్డి అన్నారు.

SHARE

LEAVE A REPLY