వైద్య సేవా రంగంలో తనదైన ముద్ర వేసుకున్న అపోలో స్పెషాలిటీ ఆసుపత్రి

0
356

Times of Nellore ( Nellore ) – అత్యాధునిక వసతులు వైద్య సేవలతో నెల్లూరు జిల్లాలోనే కాకుండా ప్రకాశం, చిత్తూరు జిల్లాల ప్రజల మన్నలను అందుకుంటూ వైద్య సేవా రంగంలో తనదైన ముద్ర వేసుకున్న అపోలో స్పెషాలిటీ ఆసుపత్రిలో నెఫ్రోలజీ విభాగాన్ని సంబంధించి నిపులైన వైద్యులు సిబ్బంది, ఆధునిక వైద్య పరికరాలు అందుబాటులో ఉన్యాయి. 2014 లో నెల్లూరు లో అపోలో స్పెషాలిటీ ఆసుపత్రి స్థాపించినప్పటి నుంచి నెఫ్రాలజీ వైద్య సేవలు జరుగుతూనే ఉన్నాయి. కిడ్నీ సంబంధ వైద్యులైన నెఫ్రాలజీ విభాగానికి 2017 లో ప్రముఖ వైద్యులు, కన్సల్టెంట్ ఛీఫ్ నెఫ్రాలజీ, ట్రాన్స్ ప్లాంట్ ఫిజీషియన్ డా. ఏ.కె. చక్రవర్తి ఆరోగ్య బాధ్యతలు స్వీకరించారు. ఇక అప్పటి నుండి కిడ్నీ సంబంధిత వ్యాదులను నివారించడంలో నిపుణులైన వైద్యులు డా. గిరీష్ రెడ్డి, యూరాలజీ డా. నిశ్చల్ ప్రసాద్, మహేష్ బాబులతో ఒక టీమ్ గా ఏర్పడి వైద్య సేవలను అందిస్తున్నారు. ఈ సందర్భంగా అపోలో ఆసుపత్రిలో జరిగిన విలేకరుల సమావేశంలో ఆసుపత్రి మెడికల్ సూపరింటెండెంట్ డా. శ్రీరామ్ సతీష్ తో కలిసి నెఫ్రాలజీ విభాగాధిపతి డా. ఏ.కె. చక్రవర్తి మాట్లాడారు. కిడ్నీ వ్యాదులు తీవ్రత ఎక్కువగా ఉన్న నెల్లూరు జిల్లాలో అపోలో ఆసుపత్రి ఆధ్వర్యంలో వైద్య సేవలు అందించడం మరువలేనిదన్నారు. 2017 నుంచి నేటి వరకు కేవలం 9 నెలల కాలంలో 27 కిడ్నీ ట్రాన్స్ ప్లాంట్లను విజయవంతంగా పూర్తి చేశామని తెలిపారు. రాష్ట్రంలోనే ఏకైక ఇంటర్వెన్షన్ నెఫ్రాలజీ వైద్యులు డా. గరీష్ రెడ్డి అపోలో లో అందుబాటులో ఉన్నారని వివరించారు. కిడ్నీ వ్యాదుల నివారణకు అపోలో ఆసుపత్రి వారు స్వీడన్ కిడ్నీ సోసైటీ మరియు రామచంద్రా మెడికల్ కాలేజి ( ఎస్ ఆర్ ఎం సి ) వారి సహకారంతో పరిశోధనలు జరుగున్నట్లు తెలిపారు. అలాగే శ్యామలమ్మ కిడ్నీ ఫౌండేషన్ వారి సహకారంతో అపోలో ఆసుపత్రి వారు పేదలకు ఉచితంగా వైద్య సేవలు అందిస్తున్నట్లు చెప్పారు. ఈ కార్యక్రమంలో వారితో పాటు ఆసుపత్రి యూనిట్ హెడ్. వి.నవీన్ రెడ్డి,తదితరులు పాల్గొన్నారు.

SHARE

LEAVE A REPLY