అపోలో వైద్యురాలు డాక్ట‌ర్ బిందు మీన‌న్‌కు ప్ర‌పంచ స్థాయి గుర్తింపు

0
706

Times of Nellore ( Nellore ) – నెల్లూరు అపోలో స్పెషాలిటీ హాస్పిట‌ల్ న్యూరాల‌జీ విభాగాధిప‌తి, ప్ర‌ముఖ న్యూరాల‌జిస్ట్‌, డాక్ట‌ర్ బిందు మీన‌న్ ఫౌండేష‌న్ అధినేత డాక్ట‌ర్ బిందుమీన‌న్‌కు ప్ర‌పంచ స్థాయి గుర్తింపు ల‌భించింది. వైద్య‌రంగంలో నూత‌న అధ్యాయానికి శ్రీ‌కారం చుడుతూ, న్యూరాల‌జీ విభాగంలో త‌నదైన సేవ‌ల‌ను అందిస్తున్న డాక్ట‌ర్ బిందుమీన‌న్‌కు వ‌ర‌ల్డ్ స్ట్రోక్ ఆర్గ‌నైజేష‌న్ వారు వ్యక్తిగత విభాగంలో వరల్డ్ స్ట్రోక్ అవార్డును ప్ర‌ధానం చేశారు. డాక్ట‌ర్ బిందుమీన‌న్ ఫౌండేష‌న్ ద్వారా ఆమె చేస్తున్న సేవ‌ల‌ను గుర్తించిన వ‌ర‌ల్డ్ స్ట్రోక్ ఆర్గ‌నైజేష‌న్, డాక్ట‌ర్ బిందుమీన‌న్‌ను ఈ అవార్డుకు ఎంపిక చేసింది. ప‌క్ష‌వాతంతో బాధ‌ప‌డే రోగులకు చికిత్స‌లు అందించ‌డంలో ప్ర‌తిభ‌క‌న‌బ‌రిచి, చిత్త‌శుద్ధితో రోగుల కోసం కృషి చేసిన వారిని గుర్తించి ఈ అవార్డును ప్ర‌ధానం చేస్తున్నామ‌ని అన్నారు. డాక్ట‌ర్ బిందు మీన‌న్ గ్రామీణ ప్రాంతాల్లో ప‌క్ష‌వాతంపై అవ‌గాహ‌న‌, ప‌క్ష‌వాతం రాకుండా తీసుకోవాల్సిన జాగ్ర‌త్త‌లు, వ్యాధి ల‌క్ష‌ణాలు, వ్యాధిని గుర్తించే విధానం, ప్రాథ‌మిక చికిత్స‌లు, అందుబాటులో ఉన్న వైద్యం త‌దిత‌ర అంశాల‌పై ప్ర‌జ‌ల్లో విసృతంగా అవ‌గాహ‌న క‌ల్పించార‌ని అన్నారు. ముఖ్యంగా టెలి హెల్త్‌, న్యూరాల‌జీ ఆన్ వీల్స్ వంటి అధ్భుత‌మైన కార్య‌క్ర‌మాలు చేప‌ట్టి, ప్ర‌జ‌ల్లో ప‌క్ష‌వాతంపై ఉన్న అపోహ‌ల‌ను రూపుమాపి, ఎంతో మంది ప‌క్ష‌వాత రోగుల‌కు స్వస్థ‌త చేకూరే విధంగా కృషి చేశార‌ని, ఆ కృషిని గుర్తించి, వ్య‌క్త‌ిగ‌త విభాగంలో డాక్ట‌ర్ బిందుమీన‌న్‌కు అంత‌ర్జాతీయ పుర‌స్కారం అందించిన‌ట్లు తెలిపారు.

ప్ర‌పంచ స్ట్రోక్ ఆర్గ‌నైజేష‌న్ నుంచి, వ్య‌క్తిగ‌త విభాగంలో అంత‌ర్జాతీయ అవార్డు అందుకున్న డాక్ట‌ర్ బిందు మీన‌న్ మాట్లాడుతూ.. డాక్ట‌ర్ బిందుమీన‌న్ ఫౌండేష‌న్‌ను స్థాపించి 5 సంవ‌త్స‌రాలు పూర్త‌యింద‌ని అన్నారు. ఈ 5ఏళ్ల కాలంలో ఫౌండేష‌న్ ద్వారా అనేక ప్ర‌జోప‌యోగ‌క‌ర కార్య‌క్ర‌మాలు చేప‌ట్టిన‌ట్లు తెలిపారు. భార‌తదేశంలోనే తొలిసారిగా త‌మఫౌండేష‌న్ ఆధ్వ‌ర్యంలో న్యూరాల‌జీ ఆన్ వీల్స్‌, టెలి అవ‌గాహ‌న కార్య‌క్ర‌మాలు చేప‌ట్టి, విజ‌య‌వంతం చేశామ‌ని అన్నారు. త‌మ ఫౌండేష‌న్ ఆధ్వ‌ర్యంలో నిత్యం ఉచిత వైద్య శిబిరాలు నిర్వ‌హిస్తున్నామ‌ని, ఇప్ప‌టి వ‌ర‌కు ప‌క్ష‌వాతం, మూర్చ వ్యాధుల‌కు సంబంధించి 50కి పైగా ఉచిత వైద్య శిబిరాలు నిర్వ‌హించి, ఎంతో మందికి చికిత్స‌లు అందించిన‌ట్లు స్ప‌ష్టం చేశారు. ముఖ్యంగా వివిధ స్కూల్స్, క‌ళాశాల‌లు, స్వ‌చ్చంద సంస్థ‌ల సంయుక్తంగా ప్ర‌జ‌ల్లో మూర్చ‌, ప‌క్ష‌వాతంపై విసృత‌స్థాయిలో బిందుమీన‌న్ ఫౌండేష‌న్ ద్వారా అవ‌గాహ‌న కార్య‌క్ర‌మాలు చేస్తున్నామ‌న్నారు. భ‌విష్య‌త్తులోనూ ఈ త‌ర‌హా కార్య‌క్ర‌మాలు మ‌ర‌న్ని చేప‌ట్టి, మూర్చ‌, ప‌క్ష‌వాత వ్యాధిగ్ర‌స్థుల‌కు మ‌రిన్ని సేవ‌లు అందించేందుకు సిద్ధంగా ఉన్న‌ట్లు డాక్ట‌ర్ బిందు మీన‌న్ వెల్ల‌డించారు. అంత‌ర్జాతీయ అవార్డు అందుకోవడం చాలా సంతోష‌ంగా ఉందని అన్నారు. ఈ కార్యక్రమంలో ఆసుపత్రి యూనిట్ హెడ్ వి.నవీన్, మెడికల్ సూపరింటెండెంట్ డాక్టరు శ్వేతా రెడ్డి లు పాల్గొన్నారు.

SHARE

LEAVE A REPLY