నెల్లూరులో ‘అన్న క్యాంటీన్ల’ను ప్రారంభించిన మేయర్

0
633

Times of Nellore ( Nellore ) – పేదలకు కడుపు నిండా భోజనం పెట్టాలనే లక్ష్యంతో ప్రభుత్వం ‘అన్న క్యాంటీన్లు’ ఏర్పాటు చేసిందని నగర మేయర్ అబ్దుల్ అజీజ్ పేర్కొన్నారు. బుధవారం నెల్లూరు నగరంలో అన్న క్యాంటీన్‌ లను మేయర్ ప్రారంభించారు. అన్న క్యాంటీన్లో ప్రజలతో కలిసి భోజనం తీసుకున్నారు. అనంతరం క్యాంటీన్‌‌ మొత్తాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రూ.5లకే రుచికరమైన అల్వాహారం, భోజనాన్ని ప్రభుత్వం అందించనుందని అన్నారు. ప్రతీ రోజు అల్పాహారం, మధ్యాహ్నం, రాత్రి భోజనం ప్రజలకు అన్న క్యాంటీన్ల ద్వారా అందుబాటులోకి తీసుకువచ్చామని చెప్పారు. ఆహార సరఫరా బాధ్యత అక్షయపాత్ర సంస్థకు ప్రభుత్వం అప్పగించిందని అన్నారు. పేదవారికి, కార్మికులకు, బాటసారులకు, బయట గ్రామాల నుంచి వచ్చే రైతులకు, పేద విద్యార్దులకు కోసం అన్న క్యాంటీన్లు ఏర్పాటు చేసామని, పేదవారికి మాత్రమేనని తెలిపారు.

SHARE

LEAVE A REPLY