నెల్లూరు ఆంధ్ర‌జ్యోతి ఆఫీస్‌ను ముట్ట‌డించిన ఎమ్మెల్యే అనీల్‌

0
1158

Times Of Nellore ( Nellore )- ఆంధ్ర‌జ్యోతి క‌థ‌నాల‌పై నెల్లూరు న‌గ‌ర ఎమ్మెల్యే డాక్ట‌ర్ అనీల్ కుమార్ యాద‌వ్ ఆగ్ర‌హించారు. బెట్టింగ్ కేసు విష‌యంలో  ఎటువంటి ఆధారాలు లేకుండా ఆంధ్ర‌జ్యోతి క‌థ‌నాల‌ను  ప్ర‌చురిస్తుందంటూ ఆయ‌న నెల్లూరు ఆంధ్ర‌జ్యోతి కార్యాల‌యాన్ని ముట్ట‌డించారు. దీనిపై తాము న్యాయ పోరాటానికి దిగుతామ‌ని, ఆంధ్ర‌జ్యోతిపై ప‌రువున‌ష్టం దావా వేస్తామ‌ని హెచ్చ‌రించారు. అంతేకాకుండా ఇక‌పై నెల్లూరులో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వ‌ర్యంలో జ‌రిగే ఏ కార్యక్ర‌మానికి కూడా ఆంధ్ర‌జ్యోతిని ఆహ్వానించేది లేద‌ని, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆంధ్ర‌జ్యోతి ప‌త్రిక‌ను బ‌హిష్క‌రిస్తుంద‌ని స్ప‌ష్టం చేశారు. ఈ ముట్ట‌డి కార్యక్ర‌మంలో డిప్యూటీ మేయ‌ర్‌తో స‌హా ప‌లువురు కార్పోరేట‌ర్లు పాల్గొన్నారు.

SHARE

LEAVE A REPLY