ఇష్టపడి చదివితేనే ఉన్నత శిఖరాలకు – నెల్లూరురూరల్ ఎమ్మెల్యే పిలుపు

0
273

Times of Nellore ( Nellore ) – ప్రతీ విద్యార్ధి ఇష్టపడి, కష్టపడి చదివితేేనే జీవితంలో ఉన్నత శిఖరాలకు చేరుతారని నెల్లూరురూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి అన్నారు. క్యాట్ పరీక్షల్లో 99.94 శాతం మార్కులు సాధించి ఐఐఎమ్ లో ప్రవేశం పొందిన 37వ డివిజన్ కు చెందిన కోట దయానంద్, షీలారాణి దంపతుల కుమారుడు హేమాక్షర్ ను ఆయన అభినందించారు. కార్పొరేటర్ బొబ్బల శ్రీనివాసయాదవ్ తో కలిసి స్వయంగా వారింటికి వెళ్లి హేమాక్షర్ కు శాలువా కప్పి, పూలబొకే తో శుభాకాంక్షలు తెలియజేశారు.

అనంతరం కోటంరెడ్డి మాట్లాడుతూ పోటీ పరీక్షలకు వెళ్లే వారు హేమాక్షర్ ను ఆదర్శంగా తీసుకోవాలని
సూచించారు. ఈ విద్యార్ధి ఎలాంటి కోచింగ్ తీసుకోకుండా, స్వయంగా సిద్ధమయ్యి పరీక్షల్లో అత్యధిక
మార్కులు సాధించడం గొప్ప విషయమని అన్నారు.

SHARE

LEAVE A REPLY