ఆస్తి మొత్తం రాముడికే

0
80

Times of Nellorre (Chejerla) – చేజర్ల మండలం మడపల్లికి చెందిన మస్తానమ్మ గ్రామంలోని తూర్పు వీధి రామమందిరంలో నిత్య దీపారాధన కార్యక్రమాన్ని నిర్వహించేవారు. ఆ ఆలయానికి రూ. 3 లక్షల నగదు, తన ఆస్తిలోని 1.70 ఎకరాల భూమిని మాన్యంగా ఇచ్చారు. భూమికి వచ్చే కౌలు, నగదుకు వచ్చే వడ్డీ మొత్తంతో ఆలయ అర్చకునికి వేతనం, ధూప దీపాలకు ఇబ్బంది కలుగకుండా ఏర్పాట్లు చేశారు. ఒంటరి జీవితం గడుపుతున్న మస్తానమ్మ తన శేష జీవితానికి కొంత ఆస్తిని ఉంచుకొన్నారు. చివరి దశలోనూ తన వద్ద ఉన్న డబ్బు, ఇల్లు, ఆస్తులన్నిటిని రామునికే సమర్పించాలని నిర్ణయించుకొన్నారు. ఆలయ అభివృద్ధికి కమిటీని ఏర్పాటు చేయించారు. తాను చనిపోవటానికి వారం రోజులు ముందుగా మిగిలిన ఆస్తులను ఆలయ నిర్వహణ కమిటీ పేర రాయించారు. మస్తానమ్మ దాతృత్వంతో మడపల్లి తూర్పు వీధి రామమందిరానికి మొత్తం రూ. 50 లక్షల విలువ చేసే ఆస్తులు సమకూరాయి. మందిరానికి సమీపంలో ఉన్న ఖాళీ స్థలంలో ఎరుకలరెడ్డి, మస్తానమ్మ దంపతుల పేర వృద్ధుల విశ్రాంతికి, ఆధ్యాత్మిక కార్యక్రమాల నిర్వహణ కోసం ఆలయ అభివృద్ధి కమిటీ పార్కును ఏర్పాటు చేస్తోంది.

SHARE

LEAVE A REPLY