ఆల్ ఫ్రీ జగన్ బాబు – నుడా ఛైర్మన్ కాటంరెడ్డి శ్రీనివాసులరెడ్డి

0
235

Times of Nellore ( Nellore ) – వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పాదయాత్ర కేవలం చంద్రబాబును విమర్శించడానికి, బీజేపికి మద్దతు ఇవ్వడానికేనని నుడా ఛైర్మన్ కాటంరెడ్డి శ్రీనివాసులరెడ్డి అన్నారు. నెల్లూరు టిడిపి కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. జగన్ మోహన్ రెడ్డి 2000 కిలోమీటర్ల పాదయాత్రలో 10 జిల్లాలు కూడా పూర్తి కాలేదని, దాదాపు 6 లక్షల కోట్ల హామీలు ఇచ్చారని అన్నారు. 16 వేల కోట్ల లోటు బడ్జెట్ లో ఉన్న ఆంధ్ర రాష్ట్రాన్ని ఎలా నడిపించాలని అనుభవజ్ఞుడైన చంద్రబాబు కిందామీదా పడుతూ ఉన్నాడని, ఎలాంటి అనుభవం లేని జగన్ 6 లక్షల కోట్ల వరకు హామి ఇవ్వడం జరిగిందని పేర్కొన్నారు. ఎన్నికలు పూర్తి అయ్యే సరికి 10 లక్షల కోట్లకు హామీలు ఇచ్చేదానికి సిద్దంగా ఉన్నారని అన్నారు. ఆయన పూర్తిగా ఆల్ ఫ్రీ జగన్ బాబుగా మిగిలిపోతారని విమర్శించారు. అన్నీ ఉచితం అనే ఇలాంటి హామీలు తాను ఎక్కడా వినలేదని అన్నారు. మీరు ఏమి హామీలు ఇస్తున్నారో మీకు గుర్తుందా అని జగన్ ను ప్రశ్నించారు. చంద్రబాబు పేదవారికి ఇళ్ళు కట్టిస్తున్నాడని, పేదవారికి కోటేశ్వరిడికి ఉండేటటువంటి నాణ్యత గల ఇళ్ళు కల్పించిన ఘనత చంద్రబాబుకే దక్కుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

SHARE

LEAVE A REPLY