మ‌ద్యం వ్యాపారుల ఆగ‌డాల‌ను త‌ట్టుకోలేకున్నాం – నెల్లూరుజిల్లా ఎక్సైజ్ పోలీసుల సంచలన ఆరోపణలు

0
1490

Times Of Nellore ( Nellore ) – నెల్లూరు జిల్లాలో మ‌ద్యం వ్యాపారుల ఆగ‌డాలు, బెదిరింపులు త‌ట్టుకోలేకున్నామ‌ని పోలీసులు ఆవేద‌న చెందారు. నిరాధార‌మైన ఆరోప‌ణ‌ల‌తో మాపై మ‌ద్యం వ్యాపారులు అబండాలు వేస్తున్నార‌ని తెలిపారు. దీనిని ఎదుర్కునేందుకు, అవినీతి ర‌హిత ఎక్సైజ్ శాఖ‌ను నిర్మించేందుకు, తాముంతా క‌లిసి నెల్లూరు జిల్లా ఎగ్జిక్యూటివ్ ఆఫీస‌ర్స్ అసోసియోష‌న్‌గా ఏర్ప‌డిన‌ట్లు తెలిపారు. ఈ సంద‌ర్భంగా అసోసియోష‌న్ అధ్య‌క్షులు అహ్మ‌ద్ భాష‌, న‌ళినిమోహ‌న్‌, శ్రీ‌న‌య్య‌లు ప్రెస్‌క్ల‌బ్‌లో విలేక‌ర్ల స‌మావేశం నిర్వ‌హించారు. ప్ర‌భుత్వ ఆదేశాల మేర‌కు తాము ఇత‌ర రాష్ట్రాల నుంచి వ‌చ్చే అన‌ధికార మ‌ద్యంని అడ్డుకుంటున్నామ‌ని, బెల్టు షాపుల‌పై ఉక్కుపాదం మోపుతున్నామ‌ని, నాటుసారా నిషేదానికి కృషి చేస్తున్నామ‌ని, క‌ల్తీ మ‌ద్యానికి చెక్ పెడుతున్నామ‌ని స్ప‌ష్టం చేశారు. దీనిని ఓర్చుకోలేని కొంత మంది మ‌ద్యం వ్యాపారులు త‌మ‌పై నిరాధార‌మైన ఆరోప‌ణ‌లు చేస్తూ పై అధికారుల‌కు ఫిర్యాదులు చేస్తున్నార‌ని తెలిపారు. దీని వ‌ల్ల త‌మ మ‌నోధైర్యం దెబ్బ‌తింటుంద‌ని చెప్పారు. ఈ విష‌యంలో ప్ర‌తికా, మీడియా ప్ర‌తినిధులు కూడా త‌మ‌కు స‌హ‌క‌రించాల‌ని, అవాస్త‌వాల‌ను ప్ర‌సారం చేయ‌వ‌ద్ద‌ని కోరారు.

SHARE

LEAVE A REPLY