ఆలయ రథానికి నిప్పు….. నెల్లూరులో ఉద్రిక్తత!!

0
267

Tmes of Nellore – ✒కోట సునీల్ కుమార్✒- నెల్లూరులో దారుణం చోటుచేసుకుంది. బోగోలు మండలం కొండబిట్రగుంటలో ఆలయ రథానికి నిప్పు పెట్టారు దుండగులు. ప్రసన్న వెంకటేశ్వరస్వామి ఆలయ రథాన్ని నిప్పుపెట్టిన వారు ఆ తరువాత అక్కడి నుంచి పరారీ అయ్యారు. రెండు వర్గాల మధ్య వివాదమే ఈ ఘటనకు కారణమంటున్నారు స్థానికులు. మరోవైపు దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు పకీర్ అనే అనుమానితుడిని అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటనతో కొండబిట్రగుంటలో ఉద్రిక్తత నెలకొంది .

SHARE

LEAVE A REPLY