నటుడు కమల్ హాసన్ వ్యాఖ్యలపై బిజేపి మండిపాటు – నెల్లూరులో దిష్ఠిబొమ్మ దహనం

0
578

Times of Nellore ( Nellore ) – హింధువుల్లోనూ ఉగ్రవాదులు ఉన్నారని, హింధూ ఉగ్రవాదాన్ని నిర్మూలించడంలో బిజేపి విఫలమైందని తమిళ సినీ నటుడు కమల్ హాసన్ చేసిన వ్యాఖ్యలపై దేశవ్యాప్తంగా దుమారం రేగింది. కమల్ వ్యాఖ్యలను పలువురు బిజేపి నేతలు ఖండించగా, నెల్లూరులో ఏకంగా ఆ పార్టీ నాయకులు కమల్ హాసన్ దిష్ఠిబొమ్మను దగ్ధం చేసి, వెంటనే అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు. బిజేపి జిల్లా ప్రధాన కార్యదర్శి మిడతల రమేష్, బిజేవైఎమ్ నాయకులు ముడియాల శ్రీనివాసరెడ్డి, నాయకులు కాకరపర్తి జగన్మోహన్ రావు తదితరులు నగరంలోని గాంధీ బొమ్మ సెంటర్ లో నిరసన చేపట్టారు. దిష్ఠిబొమ్మను దహనం చేసి కమల్ హాసన్ పై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. కొత్తపార్టీ పెట్టాలని భావిస్తున్న కమల్ హాసన్ తన ఉనికిని చాటుకునేందుకు లేనిపోని వ్యాఖ్యలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కమల్ పార్టీని ప్రజలు తిరస్కరించడం ఖాయమని స్పష్టం చేశారు. తక్షణం హింధూవులకు, బిజేపి పార్టీకి ఆయన క్షమాపణలు చెప్పాలని లేదంటే రాష్ట్రంలోని అన్నీ పోలీస్ స్టేషన్లలో కమల్ హాసన్ పై ఫిర్యాదులు చేస్తామని హెచ్చరించారు.

SHARE

LEAVE A REPLY