నెల్లూరు సింహపురి హాస్పిటల్ ద్వారా 6మందికి అవయవదానం

0
862

Times of Nellore ( Nellore ) – నెల్లూరు ప్ర‌జ‌ల‌కు మెరుగైన వైద్య‌సేవ‌లు అందిస్తూ, ఎంతో మంది ప్రాణాల‌ను కాపాడుతూ, సింహ‌పురికే వ‌న్నె తీసుకువ‌చ్చిన సింహ‌పురి హాస్పిట‌ల్స్ మ‌రో అరుదైన ఘ‌నత సాధించింది. వైద్య‌రంగంలో స‌రికొత్త ఆవిష్క‌ర‌ణ‌కు నెల్లూరు జిల్లాలో తెర‌తీసింది. వైద్యంలోనే సేవ దాగి ఉంద‌ని నిరూపించింది. సింహ‌పురి హాస్పిట‌ల్‌కు వ‌చ్చిన ఓ రోగి బ్రెయిన్ డెత్ అవ‌డంతో ఆమె అవ‌య‌వాల‌ను ప‌లువ‌రు రోగుల‌కు అమ‌ర్చారు. వివ‌రాల్లోకి వెళితే కొడ‌వ‌లూరు మండ‌లం బొంత‌పాళెంకు చెందిన 60ఏళ్ల న‌ర్స‌మ్మ బాలిరెడ్డి నెల్లూరులోని ఓ వివాహ వేడుక‌ల‌కు హాజ‌రైంది. అయితే ఆమె హ‌ఠాత్తుగా ఆప‌స్మార‌క స్థితిలోకి వెళ్ల‌డంతో, ఆమె బంధువులు న‌ర్స‌మ్మ‌ను నెల్లూరు సింహ‌పురి హాస్పిట‌ల్‌కు తీసుకువ‌చ్చారు. దీంతో ఆమెకు బ్రెయిన్ డెత్ అయింద‌ని గుర్తించిన సింహ‌పురి వైద్యులు, ఆమెకు చికిత్స అందించ‌డం ప్రారంభించారు. అయితే కేవ‌లం చికిత్స అందించ‌డ‌మే కాకుండా, ప‌ది మందికి ఈమె ద్వారా స‌హాయ‌ప‌డాల‌న్న ల‌క్ష్యంతో న‌ర‌స‌మ్మ కుటుంబ స‌భ్యుల‌ను అవ‌య‌వ‌దానానికి ఒప్పించారు. వారికి కౌన్సిలింగ్ ఇచ్చి, అవ‌య‌వ‌దానం చేయ‌డం వ‌ల్ల న‌ర్స‌మ్మ మ‌రికొంత మందిలో స‌జీవంగా ఉంటుంద‌ని తెలిపి వారి నుంచి అంగీకారం పొందారు. వెంట‌నే న‌ర‌స‌మ్మ అవ‌య‌వాల‌ను సేక‌రించేందుకు సింహ‌పురి వైద్య‌బృదం 9గంట‌లు శ్ర‌మించి, ఆమె క‌ళ్లు, ఊపిరితిత్తులు, క‌ళ్లు, లివ‌ర్‌ను తీసి ఆయా అవ‌య‌వాలు అవ‌స‌ర‌మైన హాస్పిట‌ళ్ల‌కు పంపించారు.

ఈ సంద‌ర్భంగా సింహ‌పురి హాస్పిట‌ల్‌లో నిర్వ‌హించిన విలేక‌ర్ల స‌మావేశంలో హాస్పిట‌ల్ అధినేత ర‌వీంద‌ర్ రెడ్డి, డాక్ట‌ర్ ప‌వ‌న్‌లు మాట్లాడుతూ బ్రెయిన్ డెత్ అయిన వారు ఇక తిరిగి సాధార‌ణ స్థితికి చేరుకోవ‌డం సాధ్యం కాద‌ని, అటువంటి స‌మ‌యంలో వారి అవ‌య‌వాలు అన్నీ మాములుగానే ప‌ని చేస్తుంటాయ‌ని, వాటిని తీసి వేరే వారికి అమర్చే అవ‌కాశం ఉంటుంద‌ని అన్నారు. దీనికి అనుగుణంగానే న‌ర్స‌మ్మ కుటుంబ స‌భ్యుల అంగీకారంతో ఆమె క‌ళ్ల‌ను మోడ‌ర్ ఐ హాస్పిట‌ల్‌కు అందించామ‌ని, లివ‌ర్‌ను అపోలో వైజాగ్ హాస్పిట‌ల్‌కు త‌ర‌లించామ‌ని, ఊపిరితిత్తుల‌ను చెన్నై గ్లోబ‌ల్ హాస్పిట‌ల్‌కు త‌ర‌లించామ‌ని, ఒక కిడ్నిని తిరుప‌తి స్విమ్స్ హాస్పిట‌ల్‌కు త‌ర‌లించ‌గా, మ‌రో కి్డ్నిని సింహ‌పురి హాస్పిట‌ల్‌లో ఓ రోగికి మార్పిడి చేసిన‌ట్లు వెల్ల‌డించారు.

నెల్లూరు జిల్లాలోనే తొలిసారిగా సింహ‌పురి హాస్పిట‌ల్‌లో బ్రెయిన్ డెత్ అయిన వ్కక్తి నుంచి ఊపిరితిత్తుల‌ను తీసుకుని, వేరే హాస్పిట‌ల్‌కు త‌ర‌లించిన ఘ‌నత సింహ‌పురి హాస్పిట‌ల్ సాధించింది. బ్రెయిన్ డెత్ అయిన వ్య‌క్తి అవ‌య‌వాలు మ‌రో 6 మంది రోగుల‌కు ప్రాణం పోసే విధంగా త‌మ‌దైన శైలిలో వ్య‌వ‌హ‌రించి, వైద్య‌రంగంలోనూ సేవ దాగి ఉంద‌ని సింహ‌పురి హాస్పిట‌ల్ వైద్యులు, నిర్వాహ‌కులు నిరూపించ‌డం ప‌ట్ల ప‌లువురు హ‌ర్షం వ్య‌క్తం చేస్తున్నారు.

స‌హ‌క‌రించిన జీవ‌న్‌ధామ్ ట్ర‌స్ట్‌… రాష్ట్రంలో ఎక్క‌డ అవ‌యావాలు సేక‌రించి, వాటిని స‌కాలంలో రోగికి అందించాలంటే అది జీవ‌న్ ధామ్ ట్ర‌స్ట్ చేస్తుంది. సింహ‌పురి హాస్పిట‌ల్‌లో కూడా బ్రెయిన్ డెత్ అయిన న‌ర్స‌మ్మ అవ‌య‌వాల‌ను సేక‌రించి, వాటిని అవ‌స‌ర‌మైన హాస్పిట‌ళ్లకు త‌ర‌లించ‌డంలో జీవ‌న్‌ధామ్ ట్ర‌స్ట్ ముఖ్య భూమిక పోషించింది. వారికి సింహ‌పురి హాస్పిట‌ల్ వైద్య‌బృందం, యాజ‌మాన్యం ధ‌న్యావాదాలు తెలిపారు.

SHARE

LEAVE A REPLY