నా మూడు నెలల జీతం విరాళంగా ఇస్తాను – మంత్రి అనిల్

0
72

Tmes of Nellore – ✒కోట సునీల్ కుమార్✒- కరోనా వైరస్ వేగంగా చాపకింద నీరులా వ్యాపిస్తున్న నేపథ్యంలో ఆ మహమ్మారి వ్యాప్తి చెందకుండా అరికట్టేందుకు లాక్ డౌన్ ప్రకటించడం జరిగిందని జలవనరుల శాఖ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ అన్నారు. ఈ సందర్భంగా ఆయన జెడ్ పి కార్యాలయంలో మీడియా సమావేశంలో మాట్లాడుతూ ప్రజలందరూ వాళ్ళ ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకొని ఇళ్లకే పరిమితం కావాలని, గుంపులు గుంపులుగా ఉండకూడదని, నిత్యావసరాల కోసం మార్కెట్లకు వెళ్ళినప్పుడు గ్యాప్ ఉండాలని ఆయన సూచించారు. అలాగే పక్క రాష్ట్రాలలో వున్న మన విద్యార్థులు, ఉద్యోగులు మన రాష్ట్రానికి వచ్చెనందుకు అన్ని చర్యలు తీసుకొని ఒక హెల్ప్ లైన్ నెంబర్ ఇవ్వడం జరిగిందని ఆయన అన్నారు. అనంతరం ఆయన మూడు నెలల జీతాన్ని కలెక్టర్ కి అందచేస్తానని ప్రకటించారు.

SHARE

LEAVE A REPLY