నెల్లూరులో 20న మెగా ర‌క్త‌దాన శిబిరం – చిరంజీవి యువ‌త‌

0
905

Times Of Nellore ( Nellore ) – మెగా స్టార్ చిరంజీవి జ‌న్మ‌దిన‌వేడుక‌ల‌ను నెల్లూరులో అభిమానులు ఘ‌నంగా నిర్వ‌హించ‌నున్నారు. ఇప్ప‌టికే చిరంజీవి సినీ ప్ర‌స్థానం 4 ద‌శాబ్దాలు పూర్తి చేసుకున్న శుభ‌సంద‌ర్భంగా చిరంజీవి యువత ఆధ్వ‌ర్యంలో జిల్లాలో అనేక సేవా కార్య‌క్ర‌మాలు నిరాటంకంగా కొన‌సాగుతున్నాయి. ఇందులో భాగంగా మెగ‌స్టార్ పుట్టిన రోజును పుర‌స్క‌రించుకుని ఈ నెల 20వ తేది నెల్లూరులోని మ‌హేశ్వ‌రి ప‌ర‌మేశ్వ‌రి క‌ళ్యాణ మండ‌పంలో మెగా ర‌క్త‌దాన శిబిరం నిర్వ‌హించ‌నున్నారు. ఈ సంద‌ర్భంగా నెల్లూరులో నిర్వ‌హించిన విలేక‌ర్ల స‌మావేశంలో చిరంజీవి యువ‌త జిల్లా అధ్య‌క్షులు కొట్టె వెంక‌టేశ్వ‌ర్లు మాట్లాడుతూ మెగ‌స్టార్ జ‌న్మ‌దినోత్స‌వాన్ని ప్ర‌ప‌పంచ వ్యాప్తంగా అభిమానులు ఘ‌నంగా నిర్వ‌హిస్తున్నార‌ని, ప్ర‌పంచ వ్యాప్తంగా 400 ర‌క్త‌దాన శిబిరాలు నిర్వ‌హిస్తున్నార‌ని తెలిపారు. ఇందులో భాగంగానే నెల్లూరులోని మినిబైపాస్‌లో ఉన్న మ‌హేశ్వ‌రి ప‌ర‌మేశ్వ‌రి క‌ళ్యాణ మండ‌పంలో 2వేల మంది మెగా అభిమానుల‌తో ర‌క్త‌దాన శిబిరం నిర్వ‌హిస్తున్న‌ట్లు చెప్పారు. ఈ మెగా ర‌క్త‌దాన శిబిరంలో అభిమానులు, ప్ర‌జ‌లు స్వ‌చ్చందంగా పాల్గొని ర‌క్తాన్ని దానం చేయాలని పిలుపునిచ్చారు. అనంత‌రం రెడ్ క్రాస్ సొసైటి నిర్వాహ‌కులు, మెడిక‌ల్ ఆఫీస‌ర్ సుబ్బారావు, డాక్ట‌ర్ దీప్తి కృష్ణలు మాట్లాడుతూ చిరంజీవి యువ‌త ఆధ్వ‌ర్యంలో రెడ్ క్రాస్ సొసైటి స‌హ‌కారంతో ఈ ర‌క్తదాన శిబిరం జ‌రుగుతుండ‌టం చాలా సంతోష‌క‌ర‌మని అన్నారు. ప్ర‌తి ఏటా చిరంజీవి యువ‌త రెడ్‌క్రాస్‌కు భారీ మొత్తంలో ర‌క్తం అందిస్తుంద‌ని, ఈ స‌మ‌న్వ‌యం భ‌విష్య‌త్తులోనూ కొన‌సాగాల‌ని ఆకాక్షించారు. ఈ కార్య‌క్ర‌మంలో చిరంజీవి యువ‌త నాయ‌కులు శేఖ‌ర్ రెడ్డి, ర‌వికుమార్‌, కృష్ణారెడ్డి, సూరి, ర‌వి, రాము, గ‌ణేష్‌, ఉద‌య్‌, కిషోర్ త‌దిత‌రులు పాల్గొన్నారు

SHARE

LEAVE A REPLY