108 రోజుల శ్రీ ప్రసన్న ఆంజనేయస్వామి ఆరాధనోత్సవం…

0
152

Times of Nellore ( Nellore ) – నెల్లూరు పప్పులవీధిలో వెలసివున్న శ్రీ ప్రసన్న ఆంజనేయస్వామి దేవస్థానంలో 108 రోజుల నుండి స్వామివారిని 8,100 డాలర్లతో అలంకరించి, ప్రతిరోజు తమలపాకులతో సాహస్రనామార్చన, ఆకుపూజ, తదుపరి అభిషేకములు జరిపించామని ఆలయ నిర్వహక కమిటీ తెలిపింది. 108వ రోజు 108 కలశాలతో పెన్నా నదీ జలాన్ని తీసుకొనివచ్చి స్వామివారికి అభిషేకం, ఘట్టాభిషేకం జరిపించినాము. ఉభయకర్తల సహకారంతో మధ్యాహ్నం అన్నప్రసాదవితరణ జరిగింది. సాయంత్రం 108 బుట్టల, 9 రకాల పూలతో స్వామివారికి పుష్పయాగం నిర్వహించినాము. 1500 వెండి డాలర్లను భక్తులకు ఉచితంగా పంపిణీ చేసాము. ఈ కార్యక్రమంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

SHARE

LEAVE A REPLY