నెల్లూరులో సైకో కిల్లర్ అరెస్ట్ – వర్మ సినిమాలు చూసే సైకోగా మారినట్లు విచారణలో వెల్లడి

0
3812

Times of Nellore ( Nellore ) – నెల్లూరులోని చిల్డ్రన్స్ పార్కు వద్ద ఆడిటర్ నాగేశ్వరరావు నివాసంలో పట్టపగలు దోపిడీకి వెళ్లి మహిళను హత్య చేసి మరో ఇద్దరిని తీవ్రంగా గాయపర్చిన సైకో కిల్లర్ వెంకటేశ్వర్లును నెల్లూరు పోలీసులు అరెస్టు చేసి జైలుకు పంపారు. కొండాపురం మండలం, యర్రబొట్లపల్లి గ్రామానికి చెందిన వెంకటేశ్వర్లు, గత కొంత కాలం నుండి కావలి పట్టణంలో న్యూడిల్స్ షాపు పెట్టుకొని జీవనం సాగిస్తున్నాడు. చెడువ్యసనాలకు బానిసగా మారి కిరాతకుడిగా తయారయ్యాడు. మే 4వ తేదీనా కావలి పట్టణంలో పట్టపగలు ఓ ఇంట్లోకి దూరి దోపిడికి పాల్పడ్డాడు. అడ్డొచ్చిన మహిళను సుత్తితో అతికిరాతకంగా కొట్టి చంపాడు. అడ్డొచ్చిన మరో మహిళను గాయపర్చాడు. ఆ తర్వాత ఏప్రిల్ 2వ తేదీనా నెల్లూరు రూరల్ మండలం, పెద్దచెరుకూరు గ్రామంలోని శివాలయంలో నివాసం ఉండే పూజారి దంపతులను కూడా సుత్తితో కొట్టి అతి కిరాతకంగా హత్య చేశాడు. తాజాగా చిల్డ్రన్స్ పార్కు వద్ద పట్టపగలు ఆడిటర్ నాగేశ్వరరావు నివాసంలో దోపిడీ చేశారు. అడ్డొచ్చిన ఆయన భార్యను సుత్తితో కొట్టి అతికిరాతంగా చంపాడు. ఇంట్లోనే ఉన్నబంధువులను కూడా తీవ్రంగా గాయపర్చాడు. సైకో కిల్లర్ వెంకటేశ్వర్లు తప్పించుకొనే సమయంలో నాగేశ్వరరావు అక్కడకు వచ్చి కేకలు వేయడంతో చుట్టుపక్కల వారు సైకోను అదుపులోకి తీసుకొని పోలీసులకు అప్పగించారు. సైకో కిల్లర్ వెంకటేశ్వర్లును పోలీసులు విచారించగా మొత్తం నలుగుర్ని హత్య చేసినట్లు అంగీకరించాడు. దీంతో అతన్నిఅరెస్టు చేసి, జైలుకు పంపారు. దీనిపై నెల్లూరులోని ఉమేష్ చంద్ర కాన్ఫరెన్స్ హాల్లో ఎస్పీ విశాల్ గున్నీ విలేకరుల సమావేశం నిర్వహించి వివరాలను వెల్లడించారు.

రాంగోపాల్ వర్మ సినిమాలు చూసే హత్యలు చేశా – సైకో వెంకటేశ్వర్లు వెల్లడి

మరోవైపు సైకో కిల్లర్ వెంకటేశ్వర్లు విచారణలో ఆసక్తికరమైన విషయాలను చెప్పాడు. రాంగోపాల్ వర్మ సినిమాలు చూసే తనకు ఈ తరహా హత్యలు చేయాలనిపించిందని చెప్పాడు. తనను ఎవ్వరూ అనుమానించకూడదని తన బైక్ పై ముఖ్యమంత్రి చంద్రబాబు ఫోటోను అంటించుకున్నట్లు వివరించాడు.

SHARE

LEAVE A REPLY