బుజ్జి ఫ్యాన్‌తో యువీ…

0
480

Times of Nellore ( Indore ) – క్యాన్సర్ బారిన పడి మృత్యువు అంచుల దాకా వెళ్లిన యువీ(యువరాజ్‌ సింగ్‌), ఆ మహమ్మారిని జయించి తిరిగి క్రికెట్‌లోకి పునరాగమనం చేసిన తీరు ఎందరికో స్ఫూర్తిదాయకం. కేవలం భారతీయులు మాత్రమే కాక, ప్రపంచవ్యాప్తంగా ఉన్న క్రికెట్‌ అభిమానులు సైతం యువరాజ్‌ సింగ్‌ను ఇష్టపడతారు. ఇటీవల క్యాన్సర్‌తో బాధపడుతున్న ఓ యువ అభిమానిని యువీ కలుసుకుని, తన ఔదార్యాన్ని చాటుకున్నారు. యువరాజ్‌ ప్రస్తుతం ఐపీఎల్‌ 2018 సిరీస్‌లో కింగ్స్‌ ఎలెవన్‌ పంజాబ్‌ తరుఫున ఆడుతున్నారు. మ్యాచ్‌ ప్రారంభం కావడానికి ముందు యువీ, క్యాన్సర్‌తో బాధపడుతున్న ఓ బాలుడిని కలుసుకున్నారు. దానికి సంబంధించిన ఫోటోలను కింగ్స్‌ ఎలెవన్‌ పంజాబ్‌ తన అధికారిక ట్విటర్‌ అకౌంట్‌లో షేర్‌చేసింది.

‘క్యాన్సర్‌తో బాధపడుతున్న 11 ఏళ్ల రాకీ, తన ఆదర్శంగా తీసుకునే వ్యక్తి@యువ్‌స్ట్రాంగ్‌12ను కలుకున్నాడు. యువ్‌తో రాకీ కొంత సమయం పాటు గడిపాడు. రాకీ త్వరగా కోలుకోవాలని ఆశిద్దాం’ అనే క్యాప్షన్‌తో ఆ ఫోటోను షేర్‌ చేసింది. రాకీ అసలు పేరు దైనిక్‌ భాస్కర్‌. గత 10 ఏళ్లుగా బ్లడ్‌ క్యాన్సర్‌తో రాకీ బాధపడుతున్నాడు. తనకు క్యాన్సర్‌ చికిత్స ప్రారంభం కావడానికి కాస్త ముందు యువీని కలుసుకోవాలని ఆ పిల్లాడు భావించాడు. ఇలా యువరాజ్‌, రాకీని కలుసుకున్నారు.

పిల్లాడి చేతులు పట్టుకున్న యువీ ఎంతో ఆందోళన వ్యక్తం చేశారు. కొద్దిసేపు రాకీతో సరదాగా మాట్లాడుతూ పిల్లాడిని ఉత్సాహపరిచాడు. స్కూల్‌ బ్యాగ్‌, క్యాప్‌, టీ-షర్ట్‌ను రాకీకి గిఫ్ట్‌గా ఇచ్చారు. రాకీ కచ్చితంగా ఈ మహమ్మారిని నుంచి జయిస్తాడని యువీ అన్నారు. రాకీ తండ్రికి కూడా యువీ ధైర్యమిచ్చారు. గుండె నిబ్బరం చేసుకుని ఉండాలని రాకీ తండ్రికి సూచించారు. యువరాజ్‌ సైతం 2011 తర్వాత క్యాన్సర్‌ మహమ్మారి బారిన పడ్డారు.

క్యాన్సర్‌ జయించుకుని వచ్చిన యువీ, క్రికెట్‌లోకి మళ్లీ పునరాగమనం చేశారు. ఆ బాలుడితో కలిసి యువీ దిగిన ఫోటోలు, నెటిజన్ల హృదయాలను గెలుచుకుంటున్నాయి. రాకీ త్వరగా కోలుకోవాలంటూ యువీ అభిమానులు సైతం ప్రార్థిస్తున్నారు. చికిత్స కోసం రాకీ ఆరు నెలల పాటు ఆసుపత్రిలోనే ఉండాల్సి ఉంటుంది.కొడుకును బతికించుకోవడం కోసం రాకీ తండ్రి తన బోన్‌ మారోను దానం చేశాడు.

SHARE

LEAVE A REPLY