పార్లమెంటులో మాహానేత విగ్రహాన్ని ఏర్పాటు చేయండి, స్పీకర్ కి వైసీపీ ఎంపీ లేఖ!

0
239

Times of Nellore – ✒కోట సునీల్ కుమార్✒ – దివంగత ముఖ్యమంత్రి వైఎస్.రాజశేఖరరెడ్డి విగ్రహాన్ని పార్లమెంట్‌లో ప్రతిష్ఠించాలన్న డిమాండు ఈనాటిది కాదు. ఆయన మరణానంతరం కొత్త పార్టీ పెట్టుకున్న జగన్ ఆ నాడే ఈ డిమాండ్ చేశారు. అయితే రాజకీయాల్లో పడి ఈ విషయాన్ని పెద్దగా పట్టించుకోకున్నా ఆయన జయంతికి, వర్దంతికి మాత్రం ఈ విషయం గుర్తు వస్తూ ఉంటుంది ఆ పార్టీ నేతలకి, ఎన్టీఆర్ జయంతి నాడు భారతరత్న డిమాండు లాగా. తాజాగా ఈరోజు వైఎస్ రాజశేఖర్ రెడ్డి జయంతి సందర్భంగా పార్లమెంటులో రాజశేఖరరెడ్డి విగ్రహాన్ని ఏర్పాటు చేయాలంటూ లోకసభ స్పీకర్ బిర్లాకు మచిలీపట్నం లోక్‌సభ ఎంపీ వల్లభనేని బాలశౌరి లేఖ రాశారు.

రూపాయి డాక్టర్ గా వైద్య సేవలందించి తర్వాత ఫీజ్ రీఇంబర్స్ మెంట్,ఆరోగ్య శ్రీ, తో పాటు ,పోలవరం,పులిచింతల ప్రాజెక్ట్ ల తో జలయజ్ఞానికి శ్రీకారం చుట్టిన మహానేత విగ్రహం పార్లమెంటులో ప్రతిష్టించి ఆ మహానేతను గౌరవించాలని స్పీకర్ కి లేఖ వ్రాశారు. సంక్షేమ పథకాలతో ప్రజల గుండెల్లో నిలిచిపోయిన దివంగత సీఎం రాజశేఖరరెడ్డి పథకాలు దేశవ్యాప్తంగా పలు రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేశాయని లేఖలో పేర్కొన్న బాలశౌరి. ఈరోజు రాజశేఖరరెడ్డి జయంతి కనుక స్పీకర్ ఓ నిర్ణయం తీసుకోవాలంటూ కోరారు.

SHARE

LEAVE A REPLY