చిన్నారి నోట్లో బాంబు పేల్చిన యువకుడు..

0
78

Times of Nellore (Meerat) :కోట సునీల్ కుమార్ : మీరట్: దీపావళి వేడుకల్లో భాగంగా ఓ యువకుడు చేసిన పనికి మూడేళ్ల బాలిక పరిస్థితి విషమంగా మారింది. దీపావళి వేడుకల్లో కాల్చే ఓ బాంబ్‌ను చిన్నారి నోట్లో పెట్టి వెలిగించడంతో ఆ బాలిక తీవ్రంగా గాయపడింది. ఉత్తరప్రదేశ్‌లోని మీరట్‌లో ఈ ఘటన జరిగింది.

మిలక్ గ్రామంలోని దౌరాలా రోడ్డులో మంగళవారం రాత్రి దీపావళి వేడుకల్లో భాగంగా చిన్నపిల్లలంతా కలిసి టపాసులు కాలుస్తున్నారు. మూడేళ్ల చిన్నారి చుట్టుపక్కల ఇళ్లవారితో కలిసి బయట టపాసులు కాల్చడం చూస్తోంది. అయితే అక్కడున్న హర్పాల్ అనే యువకుడు ఆ చిన్నారి నోట్లో ‘సుట్లీ బాంబ్’ పెట్టి నిప్పు అంటించాడు. దీంతో చిన్నారి తీవ్రంగా గాయపడింది. గొంతు భాగం పూర్తిగా దెబ్బతింది. దాదాపు 50 కుట్లు పడ్డట్లు వైద్యులు తెలిపారు. ఘటనకు కారణమైన హర్పాల్‌పై బాలిక తండ్రి శశికుమార్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. బాలిక పరిస్థితి విషమంగా ఉందని, నిందితుడి కోసం గాలిస్తున్నామని పోలీసులు తెలిపారు.

SHARE

LEAVE A REPLY