రాజధాని రగడ.. ఉపరాష్ట్రపతి కీలక వ్యాఖ్యలు

0
150

Times of Nellore – ✒కోట సునీల్ కుమార్✒ –  ఏపీలో మూడు రాజధానుల అంశంపై ఆందోళనలు ఇంకా కొనసాగుతూనే ఉన్న తరుణంలో.. ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు కీలక వ్యాఖ్యలు చేశారు. సీఎం, పాలనా యంత్రాంగం, హైకోర్టు, అసెంబ్లీ అన్నీ ఒక్కచోటే ఉండాలన్నారు. అన్ని ఒకచోట ఉంటేనే పాలనలో సౌలభ్యం ఉంటుందని.. ఈ విషయాన్ని రాజకీయ కోణంలో.. వివాదాస్పదంగా చూడొద్దన్నారు. తన 42 ఏళ్ళ సుదీర్ఘ అనుభవంతో ఈ మాట చెపుతున్నానన్నారు. స్వర్ణభారత్‌ ట్రస్ట్ర్‌లో మీడియాతో జరిగిన చిట్‌చాట్‌లో ఈ వ్యాఖ్యలు చేశారు. రాజధానుల అంశంపై కేంద్రం తన అభిప్రాయాన్ని తీసుకుంటే ఇదే విషయాన్ని చెప్తానన్నారు. అంతేకాదు.. అన్ని జిల్లాల్లో కేంద్ర సంస్థల్ని ఏర్పాటు చేయాలన్నారు. అభివృద్ధి వికేంద్రీకరించి.. పాలన కేంద్రీకృతం కావాలన్నదే నా అభిప్రాయమన్నారు వెంకయ్యనాయుడు.

SHARE

LEAVE A REPLY