వజ్రమా..? నీలో మరో వజ్రమా..?

0
117

Times of Nellore – ✒కోట సునీల్ కుమార్✒ –పులి కడుపున పులే పుడితుందన్నట్టు.. ఓ వజ్రం ‘కడుపున’ మరో చిన్న(పిల్ల) వజ్రం బయటపడి కనువిందు చేస్తోంది. ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన.. కాంతులీనే లోహానికి విలువ కట్టడం ఒక పట్టాన సాధ్యం కాదు. కళ్లు జిగేలుమనిపించే.. వజ్రాల కథలో ఇదొకటి. రష్యా.. సైబీరియాలోని గనిలో ఓ పెద్ద వజ్రంలో మరోకటి కనబడటం విడ్డూరం. అరుదైన ఈ వింత వజ్రం బరువు మొత్తం 0.62 క్యారెట్లు. దీన్ని సైంటిఫిక్ భాషలో ‘మాట్రియోష్కా డైమండ్’ అంటారు. అయితే.. దీన్ని పరీక్షించిన శాస్త్రవేత్తలు ఇది.. దాదాపు 80 కోట్ల సంవత్సరాల కిందటిదని తేల్చారు. కాగా.. వజ్రంలోని చిన్న వజ్రం బరువు 0.02 క్యారెట్లు ఉంది. ప్రస్తుతం ఈ వజ్రం అందరి దృష్టినీ ఆకర్షిస్తోంది.

SHARE

LEAVE A REPLY