చెరుకు తోటలో బాలిక శవం.. చేతులు కట్టేసి నగ్నంగా దారుణ స్థితిలో

0
46

Tmes of Nellore – ✒కోట సునీల్ కుమార్✒- కామంతో కళ్ళు మూసుకుపోయిన దుర్మార్గులు రోజు రోజుకు రెచ్చిపోతున్నారు. మానవత్వాన్ని మంట కలుపుతున్నారు. కన్ను మిన్ను అనకుండా అఘాయిత్యాలకు పాల్పడుతున్నారు. యువకుల నుండి కాటికి కాలు చాపిన ముసలి వాళ్ళ దాక కామంతో అన్ను మిన్ను కనపడక ఆడపిల్ల పై అత్యాచారాలకు పాల్పడుతున్నారు.కొందరు కామంతో కళ్ళు మూసుకొని వావి వరసలు మర్చిపోతున్నారు. సొంత వారి పైనే అఘాయిత్యాలకు పాల్పడుతున్నారు. అభం శుభం తెలియని తొమ్మిదేళ్ల చిన్నారి పై లైంగిక దాడికి పాల్పడ్డాడు ఈ దుర్మార్గుడు. ఆడవారి పై లైంగిక దాడులు ఎక్కువగా ఉత్తర ప్రదేశ్ అడ్డాగా మారింది.

ఉత్తర్‌ప్రదేశ్‌ లోని బరేలీ రీజియన్‌ లో మరోసారి దారుణ ఘటన వెలుగు చూసింది. మితౌలీ పోలీస్‌ స్టేషన్ పరిధిలోని కనఖేడా గ్రామ శివారులోని చెరుకు తోటలో తొమ్మిదేళ్ల బాలిక అత్యంత దారుణ స్థితిలో శవమై కనిపించింది. చేతులు కట్టేసి నగ్నంగా పడివున్న బాలికను చూసిన స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు.కనఖేడా గ్రామానికి చెందిన తొమ్మిదేళ్ల బాలిక ఆడుకోవడానికి బయటకు వెళ్ళింది. ఆడుకోవడానికి వెళ్లిన ఆమె తిరిగి ఇంటికి రాలేదు. రాత్రి అయినా కుమార్తె రాకపోవడంతో తల్లిదండ్రులు ఆందోళన పడ్డారు. అనంతరం తల్లిదండ్రులు చుట్టుపక్కల ప్రాంతాల్లో గాలించినా ఆమె ఆచూకీ దొరకలేదు. చెరుకు తోటలో నగ్నంగా పడివున్న బాలికను చూసిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. దీంతో ఎస్ఐలు దిలీప్‌ కుమార్ ప్రజాపతి, రామ్‌ వీర్ సంఘటనా స్థలానికి చేరుకుని విచారణ చేపట్టారు.

బాలిక చేతులు కట్టేసి ఉండటం, శరీరంపై దుస్తులు లేకపోవడంతో ఆమెపై అత్యాచారం చేసి హత్య చేసి ఉండొచ్చని అనుమానిస్తున్నారు. బాలిక మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. గ్రామంలో పలువురు అనుమానితులను అదుపులోకి తీసుకున్న పోలీసులు వారిని ప్రశ్నిస్తున్నారు. తల్లిదండ్రుల పిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు.

SHARE

LEAVE A REPLY