జేడీఎస్‌కూ ఝలక్‌.. ఇద్దరు ఎమ్మెల్యేలు జంప్‌!

0
467

Times of Nelllore ( Bengaluru ) – కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో అతిపెద్ద పార్టీగా నిలిచి.. మ్యాజిక్‌ ఫిగర్‌కు తొమ్మిది స్థానాల దూరంలో నిలిచిన బీజేపీ.. ప్రభుత్వ ఏర్పాటు దిశగా తన ఆపరేషన్‌ తీవ్రతరం చేసింది. ఇటు కాంగ్రెస్‌, అటు జేడీఎస్‌ నుంచి ఎమ్మెల్యేలను తమవైపు ఆకర్షించేందుకు బీజేపీ పెద్ద ఎత్తున ప్రయత్నిస్తోంది. ఇందుకు తగినట్టు ఫలితాలు కూడా కనిపిస్తున్నాయి. అటు కాంగ్రెస్‌ పార్టీ శాసనసభ్యుల సమావేశానికి ముగ్గురు ఎమ్మెల్యేలు డుమ్మా కొడితే.. ఇటు ప్రభుత్వానికి నేతృత్వం వహించాలనుకుంటున్న జేడీఎస్‌కు ఇద్దరు ఎమ్మెల్యేలు ఝలక్‌ ఇచ్చారు.

కాంగ్రెస్‌ పార్టీ మద్దతుతో కుమారస్వామి ముఖ్యమంత్రిగా జేడీఎస్‌ ప్రభుత్వాన్ని ఏర్పాటుచేయాలని భావిస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో కుమారస్వామిని జేడీఎస్‌ శాసనసభాపక్ష నేతగా ఎన్నుకునేందుకు ఆ పార్టీ ఎమ్మెల్యేలు బుధవారం బెంగళూరులోని ఓ హోటల్‌లో సమావేశమయ్యారు. ఈ సమావేశానికి జేడీఎస్‌ ఎమ్మెల్యేలు రాజా వెంకటప్ప నాయక, వెంకటరావు నాదగౌడ గైర్హాజరయ్యారు. వీరు రాకపోవడంపై జేడీఎస్‌ వర్గాలు విస్మయం వ్యక్తం చేస్తున్నాయి. బీజేపీ ఆకర్షణకు లోనై ఈ ఎమ్మెల్యేలు జేడీఎస్‌ఎల్పీ భేటీకి దూరంగా ఉన్నారా? అన్న చర్చ పార్టీలో నడుస్తోంది.

SHARE

LEAVE A REPLY