చైనా నుంచి టిక్‌టాక్‌ తరలింపు..? ఎందుకంటే..!

0
56

Times of Nellore –✒కోట సునీల్ కుమార్✒-గాల్వన్ ఘర్షణలు నేపథ్యంలో.. చైనాకు సంబంధించిన 59 యాప్స్‌పై ప్రభుత్వం నిషేధం విధించింది. దీంతో టిక్‌టాక్‌, హెలో పేరెంట్‌ కంపెనీ అయిన బైట్‌డ్యాన్స్‌ భారీగా నష్టపోతుంది.  భారత ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం ఇతర దేశాల్లో  బైట్‌డ్యాన్స్‌ కార్యకలాపాలపై ప్రభావం చూపిస్తోంది. దీంతో కార్పొరేట్‌ రీస్ట్రక్చరింగ్‌ చేయాలని  బైట్‌డ్యాన్స్‌ భావిస్తోంది. అందులో భాగంగా తమ ప్రధాన కార్యాలయాన్ని చైనా నుంచి తరలించాలని  బైట్‌డ్యాన్స్‌ భావిస్తున్నట్టు తెలుస్తోంది. తమ వ్యాపారాలకు విఘాతం కలుగకుండా చైనాతో అన్ని సంబంధాలు తెంచుకోవాలని  బైట్‌డ్యాన్స్‌ ఆలోచిస్తోంది.

వివరాల్లోకెళితే.. బైట్‌డ్యాన్స్ మళ్ళీ పూర్వ వైభవం కోసం ప్రయత్నిస్తోంది. అందుకని చైనా నుంచి ప్రధాన కార్యాలయాన్ని ఇతర ప్రాంతానికి తరలించి కొత్త మేనేజ్‌మెంట్‌ బోర్డును ఏర్పాటు చేయాలని బైట్‌డ్యాన్స్‌ భావిస్తోంది. ఇప్పటికే సీనియర్‌ ఎగ్జిక్యూటీవ్స్‌ ఈ ప్రతిపాదనలపై చర్చిస్తున్నారని సమాచారం. కోట్లాది మంది యూజర్లు, కంపెనీ ఉద్యోగులు, విధాన నిర్ణేతలు, కళాకారులు, కంటెంట్‌ క్రియేటర్స్‌, భాగస్వాముల ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకొని కీలక నిర్ణయం తీసుకోవచ్చన్న చర్చ జరుగుతోంది.

SHARE

LEAVE A REPLY