ఢిల్లీలో ముగ్గురు కరడుకట్టిన నేరగాళ్ల ఎన్‌కౌంటర్‌..

0
118

Times of Nellore (Delhi) # కోట సునీల్ కుమార్ # – దేశ రాజధాని నగరమైన ఢిల్లీలో సోమవారం ఉదయం కరడు కట్టిన నేరస్థులకు, పోలీసులకు మధ్య జరిగిన ఎన్‌కౌంటర్‌లో ముగ్గురు హతమయ్యారు. ఢిల్లీలోని రోహిణి సెక్టార్ 10 లోని ఓ పార్కు వద్ద నీరజ్ బవానియా గ్యాంగ్ కు చెందిన నేరగాళ్లు దాడి చేసేందుకు వెళుతుండగా పోలీసులు అడ్డుకున్నారు. ఈ ఎదురుకాల్పుల్లో ముగ్గురికి బుల్లెట్ గాయాలు కాగా వారిని ఆసుపత్రికి తరలించగా వారు అప్పటికే మరణించారని వైద్యులు ధ్రువీకరించారు. ఈ ఘటనలో మరో ముగ్గురు గాయపడ్డారు. ఈ ఎదురుకాల్పుల్లో ఇద్దరు పోలీసులకు బుల్లెట్లు తగిలినా, వారు బుల్లెట్ ప్రూఫ్ జాకెట్లు ధరించడంతో ముప్పు తప్పిందని డీసీపీ సంజీవ్ యాదవ్ చెప్పారు. ఈ ఎన్ కౌంటర్ అనంతరం ఇద్దరు నేరస్థులను అదుపులోకి తీసుకున్నామని డీసీపీ చెప్పారు. ఈ ఘటనలో దోపిడీ దొంగలైన అర్పిత్ ఛిత్లార్, సునీల్ భూరా, సుఖ్విందర్ లు గాయపడ్డారని డీసీపీ వివరించారు. సంఘటన స్థలంలో పోలీసులు పిస్టల్, బుల్లెట్లను స్వాధీనం చేసుకున్నారు.

SHARE

LEAVE A REPLY