ప్రజాక్షేత్రంలో తేల్చుకుంటాం – జానారెడ్డి

0
110

Times of Nellore(Hyd) – తమపై  శాసనసభ సభ్యత్వాల రద్దు, సస్పెన్షన్ల వేటును విపక్ష కాంగ్రెస్‌ తీవ్రంగా పరిగణించింది. స్పీకర్‌ చర్యలను తీవ్రంగా నిరసిస్తూ ఈమేరకు సంచలన నిర్ణయాన్ని తీసుకోనున్నట్లు ప్రకటించింది. అందరికీ అందరూ కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలు మూకుమ్మడి రాజీనామాలు చేస్తామని సీఎల్పీ నేత జానారెడ్డి చెప్పారు. ‘ప్రభుత్వం నియంతలా వ్యవహరిస్తున్నది. ఏ నిబంధన ప్రకారం మా సభ్యుల సభ్యత్వాలు రద్దు చేస్తారు? ఏం తప్పు చేశామని సస్సెన్షన్‌ విధించారు? కనీసం వివరణ తీసుకోకుండా ఇంత తీవ్ర నిర్ణయం తీసుకుంటారా? ఇక మీతో మాట్లాడి ప్రయోజనం లేదు. ప్రజాక్షేత్రంలోనే అమీతుమీ తేల్చుకుంటాం..’ అని కాంగ్రెస్‌ పక్షనేత జానా రెడ్డి అన్నారు.ఇదే విషయాన్ని ఢిల్లీ అధిష్టానానికి కూడా తెలియజేశామని, అక్కడి నుంచి గ్రీన్‌ సిగ్నల్‌ రాగానే రాజీనామాలు చేస్తామని నేతలు చెప్పారు.

SHARE

LEAVE A REPLY