ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ చట్టాన్ని బలోపేతం చేయాలి

0
240

Times of Nellore ( Delhi ) – ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ చట్టం నిర్విర్యమవుతుందని, దీనిని మరింత బలోపేతం చేస్తూ ఆర్డినెన్స్ తీసుకురావాలని సోమవారం భారత రాష్ట్రపతి రాంనాథ్ కోవింద్ ను కలిసి ఏపీ రాష్ట్ర ప్రజా ప్రతినిధులు బృందం విజ్ఞప్తి చేసింది. రాష్ట్ర మంత్రులు నక్కా ఆనంద్ బాబు, కె.ఎస్. జవహార్, ఎంపీ పి.రవీంద్రబాబు, ఏపీ ఎస్సీ, ఎస్టీ కమిషన్ ఛైర్మన్ కారెం శివాజీ, ఎస్సీ ఫైనాన్స్ కార్పొరేషన్ ఛైర్మన్ జూవూడి ప్రభాకర్, శాసన మండలి చీఫ్ విప్ డొక్కా మాణిక్యాల రావు, ఏపీఎస్ఆర్టీసీ ఛైర్మన్ వర్ల రామయ్య, లీడ్ క్యాప్ ఛైర్మన్ గూడూరి బాబు, ఎమ్మెల్యేలు అనిక, వి.రాజేశ్వరి, పీతల సుజాత, ఉప్పులేటి కల్పన, రంగిరాల సౌమ్య, తెనాలి శ్రవణ కుమార్, రావెల కిశోర్ బాబు, డేవిడ్ రాజు, జయరాములు, యామిని బాల, ఈరన్న, జి. ఈశ్వరి, ప్రభుత్వ ముఖ్య కార్యదర్శి ఎస్.ఎస్.రావత్, తదితరులు ఈ బృందంలో ఉన్నారు. రాష్ట్రపతిని కలిసిన అనంతరం బృందం ఏపీ భవన్ లో మీడియా సమావేశం ఏర్పాటు చేసింది. ఏంపీ రవీంద్రబాబు తదితరులు మాట్లాడుతూ.. మార్చి 20 నుంచి దళితులు చనిపోయారని, ఎస్సీ, ఎస్టీ వర్గాలు ఆందోళనకు గురవుతున్నారని పేర్కొన్నారు. కేంద్రం జోక్యం చేసుకుని దళితులకు భరోసా కల్పించాలని కోరారు.

SHARE

LEAVE A REPLY