కార్వీ స్టాక్ బ్రోకింగ్ లైసెన్సు రద్దు!!

0
123

Times of Nellore – ✒కోట సునీల్ కుమార్✒ –ఇన్వెస్టర్ల నిధులను మళ్లించి రూల్స్ ని అతిక్రమించిన కార్వీ స్టాక్ బ్రోకింగ్స్ లైసెన్సును ఎన్ఎస్ఈ రద్దు చేసింది. కేపిటల్ మార్కెట్, ఫ్యూచర్స్, ఆప్షన్, కరెన్సీ, డిరైవేటివ్స్ , డెట్ (రుణాలు), కమోడిటివ్ డిరైవేటివ్ సెగ్మెంట్ రంగాల్లో ఈ సంస్థ ట్రేడింగ్ లావాదేవీలకు కూడా ఫుల్ స్టాప్ పెట్టింది. కార్వీతో సంబంధం ఉన్న ఇన్వెస్టర్లు ఇతర బ్రోకర్స్ ని ఆశ్రయించవచ్చునని పేర్కొంది. తన క్లయింట్ల నిధులను కార్వీ.. ఇతర ప్రయోజనాలకు మళ్లించిందని ఎన్ఎస్ఈ (నేషనల్ స్టాక్ ఎక్స్ ఛేంజ్ ) దర్యాప్తులో వెల్లడైంది. ఇక బాంబే స్టాక్ ఎక్స్ ఛేంజ్ కూడా తన నిబంధనలను అతిక్రమించినందుకు కార్వీ స్టాక్ బ్రోకింగ్స్ ని సస్పెండ్ చేయడం విశేషం.

ఈ నెల 2 నుంచి ఈ సంస్థ ట్రేడింగ్ టర్మినల్స్ ను తాము డీయాక్టివేట్ చేస్తున్నట్టు బీఎస్ఈ తన సర్క్యులర్ లో వెల్లడించింది. రూ. 2 వేల కోట్ల మేర క్లయింట్ల నిధులను ఎగవేసి డీఫాల్టర్ అయిన ఈ సంస్థను ‘ సెబీ ‘ ఇటీవల బ్యాన్ చేసింది. అలాగే కొత్త క్లయింట్లను చేర్చుకోవడాన్ని, ప్రస్తుత కస్టమర్ల ట్రేడింగ్ లావాదేవీల కొనసాగింపును కూడా సెబీ నిషేధించింది. కాగా- సెటిల్మెంట్ కోసం సెక్యూరిటీల టెండరింగ్ కు తమను అనుమతించాలని కార్వీ.. సెక్యూరిటీస్ అప్పిలేట్ ట్రిబ్యునల్ ను ఆశ్రయించింది. మరోవైపు-క్లయింట్లకు పవరాఫ్ అటార్నీ అధికారాన్ని ఇవ్వడానికి ఈ సంస్థను అనుమతించాలా, వద్దా అన్న విషయాన్ని తెలియజేయాలని సెబీని ఈ ట్రిబ్యునల్ కోరింది. కార్వీ స్టాక్ బ్రోకింగ్స్ ఇచ్ఛే ఆదేశాలకు అనుగుణంగా నడుచుకోరాదని సెబీ.. డిపాజిటర్లకు కూడా సూచించింది.

SHARE

LEAVE A REPLY