ఖాతాదారులకు SBI మరో షాక్..!

0
108

Times of Nellore – ✒కోట సునీల్ కుమార్✒- స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇటీవల తన ఖాతాదారులకు వరుసగా షాకుల మీద షాకులు ఇస్తోంది. ప్రభుత్వ రంగ సంస్థ అన్న నమ్మకంతో ఎక్కువ మంది ఎస్బీఐ ఖాతా తీసుకుంటారు. ఈ బ్యాంకు సేవలపై ఇప్పటికే ఖాతాదారులు కాస్త అసంతృప్తితో ఉంటుంటారు.

ఇప్పుడు అది కాస్తా పెరిగే నిర్ణయం తీసుకుంది. అదనపు రుణాలు, కార్పొరేట్లు, బిల్డర్లకు ఇచ్చే రుణాలపై మళ్లీ ప్రాసెసింగ్ ఫీజు వసూలు చేసేందుకు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సిద్ధమవుతోందని వార్తలు వస్తున్నాయి. ఈ మేరకు కొన్ని ఆంగ్ల పత్రికల్లో కథనాలు వచ్చాయి కూడా.

రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియా కీలక రేట్లలో కోత విధించిన నేపథ్యంలో నికర వడ్డీ ఆదాయం గణనీయంగా తగ్గుతున్నందునే బ్యాంక్ ఈ నిర్ణయం తీసుకుందని ఆ పత్రికలు విశ్లేషించాయి. పండగల సీజన్ నేపథ్యంలో డిసెంబరు 31 వరకు రుణాలపై ప్రాసెసింగ్ ఫీజు రద్దు చేయాలన్న ప్రతిపాదనను ఉపసంహరించుకుంటున్నామని ఎస్బీఐ కూడా తెలిపింది. ప్రాసెసింగ్ ఫీజు రద్దు అక్టోబరు 15 వరకు మాత్రమే ఉంటుందని ఆ బ్యాంకు ఓ ప్రకటనలో తెలిపింది.

SHARE

LEAVE A REPLY