శబరిమలకు వెళ్ళేటప్పుడు భక్తులు గుర్తుంచుకోవాల్సినవి ఇవే.?

0
147

Times of Nellore – ✒కోట సునీల్ కుమార్✒ –శబరిమల అయ్యప్ప సన్నిధానానికి భక్తులు పోటెత్తుతున్నారు.మాలధారణ ద్వారా అయ్యప్ప దీక్ష పూనిన భక్తులందరూ శబరిమల వెళ్లి అయ్యప్పస్వామి దర్శించుకుని దీక్ష విరమించుకుంటున్నారు . ప్రస్తుతం శబరిమల అయ్యప్ప సన్నిధానం మాలధారణ భక్తులతో కిటకిటలాడుతోంది. అయితే శబరిమల దర్శనానికి వెళ్లిన అయ్యప్ప భక్తులకు తీవ్ర ఇబ్బందులు ఎదురవుతూ ఉంటాయి. ఇటీవలె ముంబైకి చెందిన భక్తులు శబరిమల కి వెళ్లి తిరిగి వస్తుండగా గుండెపోటుతో మరణించాడు . శబరిమల కు వెళ్ళిన ఎంతో మంది భక్తులు ఆరోగ్యం సరిగాలేక గుండెపోటుకు గురై మరణిస్తున్నారు. ఈ క్రమంలో కేరళ ప్రభుత్వం అప్రమత్తం అయినట్లు తెలుస్తోంది. శబరిమల యాత్రకు బయలుదేరిన భక్తులకు వైద్యసేవలు నిర్ణయించింది కేరళ ప్రభుత్వం.

అయితే అయ్యప్ప దర్శనం కోసం వస్తున్న భక్తులందరికీ ఇప్పటికే నీలక్కల్ పంబా తో పాటు పంబా నుంచి సన్నిధానానికి వరకు ఆస్పత్రిలను ఏర్పాటు చేసింది కేరళ ప్రభుత్వం. కేరళ ప్రభుత్వం ఏర్పాటుచేసిన ఆస్పత్రిలో వైద్యులు అయ్యప్ప భక్తులకు 24 గంటలు అందుబాటులో ఉండనున్నారు . కాగా ఇందులో కార్డియాలజిస్ట్, ఫిజిషియన్, అలోపతి, ఆర్థోపెడిక్ పీడియాట్రీషియన్ నిపుణులు అయ్యప్ప భక్తులకు అందుబాటులో ఉంటారు. సన్నిధానం వరకు ఆసుపత్రులు అత్యాధునిక సదుపాయాలతో భక్తులకు అందుబాటులో ఉన్నాయి. ఆపరేషన్ థియేటర్, వెంటిలేటర్,ఐసీయూ లాంటి సేవలు అందుబాటులో ఉన్నాయి. భక్తుల కోసం ఏర్పాటు చేసిన వైద్యశాలల్లో వైద్యులతో పాటు శిక్షణ పొందిన వైద్య సిబ్బంది, పారామెడికల్ విద్యార్థులు కూడా ఉంటారు .

ఇక అయ్యప్ప సన్నిధానంలో మండల సీసన్ ప్రారంభమైనప్పటినుంచి ఇప్పటివరకు పదకొండు వేల మంది అయ్యప్ప భక్తులకు చికిత్సను అందించారు వైద్య సిబ్బంది. 11 వేల మంది అత్యవసర సేవలు పొందగా అందులో ఐదు వేలమంది భక్తులు గుండె సమస్యలతో బాధపడుతున్నవారు ఉండటం గమనార్హం . అయితే భక్తులకు కేరళ ఆరోగ్యశాఖ కొన్ని ముఖ్యమైన సూచనలు చేసింది.

పంబా నుంచి సన్నిధానానికి వెళ్ళే దారిలో… గుండెల్లో మంట ఊపిరాడకపోవడం చాతి నొప్పి లాంటిది భక్తులు గుర్తిస్తే వెంటనే పక్కనే ఉన్న అత్యవసర వైద్య సదుపాయాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించింది. లేని పక్షంలో ఆ లక్షణాలు గుండెపోటుకు దారి తీస్తాయని తెలిపింది కేరల ఆరోగ్య శాఖ. కొండ ఎక్కేటప్పుడు దిగేటప్పుడు భక్తులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని అంతేకాకుండా కొండ ఎక్కే ముందు స్వల్ప ఆహారం మాత్రమే తీసుకోవాలి అని సూచిస్తుంది. ఇంతకు ముందు నుంచే మందులు వాడుతున్న వారు వాటిని వెంట తీసుకొని ఉపయోగించాలని… ఇక 45 సంవత్సరాలు పైబడిన వారు కొండ ఎక్కే ముందు ఆరోగ్య పరీక్షలు చేయించుకోవాలి సూచించింది. బిపి ఆస్తమా డయాబెటిస్ లాంటి వ్యాధులు ఉన్నవారు తప్పనిసరిగా మందులను వెంట తీసుకు వెళ్లాలని సూచిస్తోంది కేరళ ఆరోగ్యశాఖ. కొండ ఎక్కేటప్పుడు భక్తులకు ఎలాంటి సమస్యలు ఉన్నా పక్కనే ఉన్న ఆక్సిజన్ పార్లర్ లకు వెళ్లి సహాయం పొందాలి అని చెబుతోంది.

SHARE

LEAVE A REPLY