వందలాది మద్యం బాటిళ్లను రోడ్డు రోలర్‌తో తొక్కించేశారు..

0
141

Times of Nellore ( Ranga Reddy ) – ఈ సీన్ చూస్తే మద్యం బాబులు బోరుమంటారేమో! జిల్లా పోలీసులు అలాంటి చర్యకు పూనుకున్నారు మరి. వందలాది మద్యం బాటిళ్లను వరుసగా నేలపై పేర్చి రోడ్డు రోలర్‌తో తొక్కించారు. దీంతో మద్యం అక్కడ వరదలా పారింది. వివరాల్లోకెళితే.. రాజేంద్రనగర్‌ ఎక్సైజ్ పోలీసులు అక్రమంగా విక్రయిస్తున్న విదేశీ మద్యం బాటిళ్లను స్వాధీనం చేసుకున్నారు. కొందరు వ్యక్తులు విదేశాల నుంచి అక్రమంగా తెచ్చిన మద్యం బాటిళ్లను నగరంలో విక్రయిస్తున్నట్లు ఎక్సైజ్ పోలీసులకు సమాచారం అందింది. ఈ మేరకు మాటు వేసి స్మగ్లర్లను పట్టుకున్న పోలీసులు.. వారి వద్ద నుంచి వివిధ బ్రాండ్లకు చెందిన 640 విదేశీ మద్యం బాటిళ్లను స్వాధీనం చేసుకున్నారు. వీటి విలువ సుమారు రూ.40 లక్షలు ఉంటుందని అంచనా. అయితే స్వాధీనం చేసుకున్న మద్యం బాటిళ్లను సెక్షన్ 46 ప్రకారం.. అధికారుల సమక్షంలో రోడ్డుపై పరిచి రోడ్డు రోలర్‌తో తొక్కించారు. కాగా, బీహార్‌లో మద్యపాన నిషేధం విధించిన సందర్భంలో అక్కడి అధికారులు కూడా వేలాది మద్యం సీసాలను రోడ్డు రోలర్‌తో తొక్కించి ధ్వంసం చేశారు.

SHARE

LEAVE A REPLY