విద్యార్థులకు గట్టి భరోసా : రాహుల్ గాంధీ

0
130

Times of Nellore (NewDelhi)# కోట సునీల్ కుమార్‌# : కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ విద్యార్థులకు గట్టి భరోసా ఇచ్చారు. వారి అభివృద్ధికి ఆటంకంగా మారిన అవినీతిని అంతం చేస్తానని పేర్కొన్నారు. విద్యార్థులకు మంచి అవకాశాలు రావడానికి తీసుకోగలిగిన అన్ని చర్యలను కాంగ్రెస్ తీసుకుంటుందని హామీ ఇచ్చారు. నేడు దేశాలు పైచేయి సాధించడానికి కారణం యుద్ధాలు కాదని, శాస్త్ర, సాంకేతిక, సాహిత్య రంగాల్లో సాధిస్తున్న అభివృద్ధేనని చెప్పారు. విద్యార్థులను ఉద్దేశించి రాసిన లేఖలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ఈ లేఖను ప్రాంతీయ భాషల్లోకి అనువదించి, దేశవ్యాప్తంగా విద్యార్థులకు ఎన్‌ఎస్‌యూఐ పంపిణీ చేస్తుందని కాంగ్రెస్ పార్టీ ప్రకటించింది. విద్యార్థుల మద్దతు సాధించేందుకు ‘మెరుగైన భారత దేశం’ పేరుతో ప్రచారం నిర్వహించనున్నట్లు తెలిపింది. న్యాయం, హేతుబద్ధతలను అనుసరించడం ద్వారానే సమాజాలు అభివృద్ధి సాధిస్తాయని రాహుల్ ఆ లేఖలో పేర్కొన్నారు. ఈ ప్రగతిశీల అభివృద్ధిలో విద్యార్థులు ముందు వరుసలో ఉన్నారన్నారు. ఈ సందర్భంగా ఆయన విద్యార్థుల సమస్యలను కూడా ప్రస్తావించారు. భారీ ఫీజులు, పరిమితమైన సీట్ల కోసం గట్టి పోటీ వంటి సమస్యలను ప్రస్తావించారు. విద్యార్థులకు తగిన గౌరవం దక్కేలా చేస్తామని, వారి ఆకాంక్షలు నెరవేరడానికి అవసరమైన మద్దతు ఇస్తామని పేర్కొన్నారు.

SHARE

LEAVE A REPLY