రాహుల్ ద్రావిడ్ క్రికెట్ కెరియర్ లో అవార్డులు మరియు రికార్డులు..!!

0
195

Times of Nellore – ✒కోట సునీల్ కుమార్✒ – భారతీయ క్రికెట్ టీం కి కెప్టెన్ గా మరియు కీలకమైన బ్యాట్స్ మెన్ గా రాణించిన రాహుల్ ద్రావిడ్ 2012వ సంవత్సరంలో అన్ని ఫార్మాట్లకు రిటైర్మెంట్ ప్రకటించడం జరిగింది. ప్రస్తుతం భారత క్రికెట్ జట్టుకు సలహాదారుడిగా మరియు మ్యాచ్ జరుగుతున్న సందర్భంలో కామెంటేటర్ గా రాణిస్తున్నాడు రాహుల్ ద్రావిడ్. మరికొద్ది రోజుల్లో రాహుల్ ద్రావిడ్ పుట్టినరోజు సందర్భంగా రాహుల్ ద్రావిడ్ కెరియర్లో అందుకున్న అవార్డులు రికార్డుల గురించి ఒకసారి పరిశీలిస్తే రెండువేల సంవత్సరంలో విజ్డెన్ క్రికెటర్‌గా ఎంపికయ్యాడు. అంతేకాకుండా 2004వ సంవత్సరంలో భారత ప్రభుత్వంచే పద్మశ్రీ అవార్డు తో సత్కరించభడ్డాడు అదే సంవత్సరంలో ఐసీసీ ప్లేయర్ ఆఫ్ ది ఇయర్ గా ఎంపికయ్యాడు. టెస్ట్ క్రికెట్ లో 10000 పరుగులు పూర్తి చేసిన ఆరవ బ్యాట్స్‌మెన్ (మూడవ భారతీయుడు) గా పేరు సంపాదించాడు.

అంతేకాకుండా వన్డే క్రికెట్ ఇంటర్నేషనల్ చరిత్రలో అర్జెంటుగా భాగస్వామ్య రికార్డ్ సచిన్ టెండూల్కర్ తో కలసి న్యూజీలాండ్ జట్టుపై సాధించడం జరిగింది. ఏకంగా ఆ మ్యాచ్లో ఇద్దరూ కలిసి హైదరాబాదులో 331 పరుగుల పాట్నర్‌షిప్ సాధించడం జరిగింది. మరియు అదే విధంగా 1999 ప్రపంచ కప్ క్రికెట్ లో అత్యధిక పరుగులు చేసిన బ్యాట్స్ మాన్ గా ఘనత సాధించాడు. అంతేకాకుండా క్రికెట్ చరిత్రలోనే వరుసగా 120 వన్డేలలో డకౌట్ కాకుండా రికార్డు క్రియేట్ చేశాడు.

ఇంకా చాలా అవార్డులు, రికార్డులు రాహుల్ ద్రవిడ్ తన కెరీర్లో అందుకున్నాడు. ముఖ్యంగా 2001వ సంవత్సరంలో అప్పటి టాప్ ఇంటర్నేషనల్ టీం ఆస్ట్రేలియాతో జరిగిన టెస్ట్ మ్యాచ్లో వివిఎస్ లక్ష్మణ్ తో కలసి ఏకంగా 376 పరుగుల భాగస్వామ్యం నమోదు చేశాడు రాహుల్ ద్రావిడ్. ఆ క్షణంలో వాళ్ళిద్దరూ ఆడిన ఆట ఇప్పటికీ భారత్ క్రికెట్ టీమ్ ప్రేమికులు ఎవరూ మర్చిపోలేరు. ప్రస్తుతం రాహుల్ ద్రావిడ్ తనవంతుగా ప్రజెంట్ భారత కుర్ర టీం సభ్యులకు సలహాలు సూచనలు ఇస్తూ భారత క్రికెట్ జట్టుకు తన వంతు గా ఉపయోగపడుతున్నడు.

SHARE

LEAVE A REPLY