ప్రేమ పెళ్లిళ్లకు వ్యతిరేకంగా విద్యార్థినుల ప్రమాణం..!!

0
66

Tmes of Nellore – ✒కోట సునీల్ కుమార్✒-ప్రేమికుల దినోత్సవం సందర్భంగా.. ప్రేమ పెళ్లిళ్లు చేసుకోబోమని మహారాష్ట్రకు చెందిన విద్యార్థినులు ప్రమాణం చేశారు. చందూర్‌ పరిధిలోని మహిళా ఆర్ట్స్‌ అండ్‌ కామర్స్‌కు చెందిన విద్యార్థులు ఈ నిర్ణయం తీసుకున్నారు.
విద్యార్థినుల ప్రమాణ సారాంశం.. ‘మాకు మా తల్లిదండ్రులపై పూర్తి నమ్మకం ఉంది. మేము ప్రేమలో పడిపోం.. ప్రేమ వివాహాలు చేసుకోం అని ప్రమాణం చేస్తున్నాం’ అని తెలిపారు. వరకట్నం అధికంగా డిమాండ్‌ చేసే వారిని కూడా తిరస్కరిస్తామని విద్యార్థినులు ప్రమాణం చేశారు.
మనం ప్రేమించే వ్యక్తి మంచివాడై ఉండాలి.. నమ్మకం కలిగి ఉండాలి. అయినప్పటికీ ప్రేమ విషయంలో తల్లిదండ్రుల సలహాలు, సూచనలు తీసుకోవాలని విద్యార్థిని రితిక చెప్పింది. మరో విద్యార్థిని మాట్లాడుతూ.. ప్రేమ వివాహం చేసుకోవాల్సిన అవసరం ఏముంది? మన ఇష్టా ఇష్టాలకు అనుగుణంగానే మన తల్లిదండ్రులు పెళ్లిళ్ల విషయంలో జాగ్రత్తలు తీసుకుంటారు. అలాంటప్పుడు ప్రేమ వివాహాలు అవసరం లేదని స్పష్టం చేసింది. మహిళలు, యువతులపై ప్రేమ పేరుతో జరుగుతున్న అఘాయిత్యాలపై కలత చెంది, విద్యార్థినులు తప్పుదోవ పట్టద్దనే ఉద్దేశంతోనే ఈ ప్రమాణం చేయించామని ఆ రాష్ట్ర మహిళా, శిశు సంక్షేమ శాఖ మంత్రి యశోమతి ఠాకూర్‌ పేర్కొన్నారు.

SHARE

LEAVE A REPLY