ఎక్కడైనా రేట్లు పెంచారా.. ఈ నెంబర్‌కు కాల్ చేయండి.. తిక్క కుదురుస్తారు..!

0
97

Tmes of Nellore – ✒కోట సునీల్ కుమార్✒- దేశమంతటా ఒక్కటవ్వాల్సిన లాక్ డౌన్‌ సమయంలో కూడా కొందరు తమ స్వార్థ బుద్ధిని చూపిస్తున్నారు . ఛాన్సు దొరికింది కదా అని రేట్లు అమాంతం పెంచేస్తున్నారు . అదేమైనా అంటే .. లాక్ డౌన్ సరుకులు దొరకడం లేదు . మీ ఇష్టమైతే కొనండి .. లేకపోతే లేదు అంటూ జులుం చేస్తుంటారు . దీంతో సామాన్య జనం జేబులు ఖాళీ అవుతున్నాయి .లాక్ డౌన్ తో పనులు దొరక్క ఆదాయం లేక ఓవైపు సమస్య ఉంటే .. ఇలాంటి వ్యాపారుల కక్కుర్తితో సామాన్యుడు ఇబ్బంది పడుతున్నాడు . ఇప్పుడు ఇలాంటి సమస్య లేకుండా జగన్ సర్కారు ఓ ఏర్పాటు చేసింది . ఇకపై నిత్యావసరాల ధరలు పెంచితే 1902 నెంబర్ కు ఫోన్ చేస్తే చాలు .. వాళ్లు తిక్క కుదురుస్తారు . అప్పటికీ ఇంకా రేట్లు పెంచి అమ్ముతూ ఉంటే .. తగిన చర్యలు తీసుకుంటారు .

రేట్లు పెంచిన వాళ్ల వివరాలు నమోదు చేసుకుని .. ఆ తర్వాత వాళ్ల లైసెన్సులు క్యాన్సిల్ చేస్తారు . వాస్తవానికి ఇలా సరుకుల ధరలు కొరత వల్ల పెంచుతారు . కానీ ఇప్పుడు అలాంటి పరిస్థితి లేదు . ధరలు పెంచారంటే అది వ్యాపారుల లాభాల కోసమే అని అర్థం చేసుకోవాలి . ఇలాంటి సమయంలో పోనీలే ఏం చేస్తామని ఊరుకోకుండా ఒక్కసారి 1902 కు కాల్ చేసి ఫిర్యాదు చేయండి .మీరు ఇలా చేస్తే .. మీరే కాదు .. ఆ ప్రాంతంలోని మిగిలిన వారు కూడా మీ చర్య వల్ల లాభపడతారు . ఏదో ఒక పరిస్థితిని అడ్డు పెట్టుకునేవారిని ప్రశ్నిస్తేనే వారు దారికొస్తారు లేకపోతే ఇంకా రెచ్చిపోతారు . అందుకే ఇకపై ప్రశ్నించడం నేర్చు కోండి . లేకపోతే ఈ లాక్ డౌన్ పూర్తయ్యే లోగా మీ జేబులు ఖాళీ అవ్వడం ఖాయం .. ఏమంటారు ..?

SHARE

LEAVE A REPLY