చిన్నమ్మకు పెరోల్‌.. షరతులు…

0
575

Times of Nellore ( Bangalore) – ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో బెంగుళూరు జైలులో శిక్ష అనుభవిస్తున్న ‘చిన్నమ్మ’ శశికళకు పెరోల్‌ మంజూరైంది. అనారోగ్యంతో ఉన్న తన భర్తను చూసేందుకు శశికళకు 5 రోజుల పెరోల్‌ ఇచ్చారు. దీంతో దాదాపు ఎనిమిది నెలల తర్వాత ఆమె జైలు నుంచి బయటకు రానున్నారు. శశికళను తీసుకొచ్చేందుకు ఇప్పటికే ఆమె మేనల్లుడు దినకరన్‌, మద్దతుదారులు పరప్పన అగ్రహార జైలుకు చేరుకున్నారు.
శశికళ భర్త నటరాజన్‌ గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. ఇటీవలే చెన్నైలోని ఓ ప్రవేటు ఆసుపత్రిలో ఆయనకు కిడ్నీ, లివర్‌ మార్పిడి శస్త్రచికిత్స చేశారు. తన భర్తను చూసేందుకు పెరోల్‌ మంజూరు చేయాలంటూ శశికళ దరఖాస్తు చేసుకున్నారు. అయితే దరఖాస్తు పత్రాలు సంపూర్ణంగా లేవంటూ గత మంగళవారం ఆమె పిటిషన్‌ను జైళ్ల శాఖ కొట్టివేసింది. దీంతో సరైన పత్రాలతో మరోసారి పెరోల్‌కు దరఖాస్తు చేసుకున్నారు.
ఈ పిటిషన్‌ను పరిశీలించిన అనంతరం నేడు ఆమెకు షరతులతో కూడిన పెరోల్‌ మంజూరైంది. శశికళ చెన్నైలో ఎవరినీ కలవకూడదని, తన బంధువుల ఇంటిలో మాత్రమే ఉండాలని నిబంధనలు విధించారు. ఈ సమయంలో ఎలాంటి రాజకీయ కార్యక్రమాల్లో పాల్గొనరాదని, మీడియాకు ప్రకటనలు చేయొద్దని పేర్కొన్నారు.

SHARE

LEAVE A REPLY