నోటికొచ్చినట్లు మాట్లాడితే సస్పెండై: రోజాపై పవన్ కల్యాణ్ పంచ్!!

0
598

Times of Nellore ( Tirupati ) – వైయస్సార్ కాంగ్రెసు పార్టీ శాసనసభ్యురాలు రోజాపై జనసేన అధినేత పవన్ కల్యాణ్ విరుచుకుపడ్డారు. ఆమె పేరు చెప్పకుండా తీవ్రమైన వ్యాఖ్యలు చేశారు. శనివారం తిరుపతి బహిరంగ సభలో ఆయన ఎవరినీ వదిలిపెట్టలేదు. రాష్ట్రం కష్టాల్లో ఉంది కదా రాద్ధాంతమెందుకని నేను మౌనంగా పరిస్థితులు గమనిస్తుంటే నన్ను కొంత మం ది విమర్శించారని అంటూ ఆయన రోజాపై వ్యంగ్యాస్త్రాలు విసిరారు.

‘నువ్వు గబ్బర్‌ సింగ్‌ కాదు రబ్బర్‌ సింగ్‌ అన్నారు. పడతామబ్బా. మాటలు పడుతాం. ఎవరేమన్నా వింటాం. నేను నోటికి ఏదొస్తే అది మాట్లాడే మనిషిని కాదు. నోరుపారేసుకుంటే ఏమౌతుంది? సస్పెండై ఇంట్లో కూర్చోవలసి వస్తుంది’ అని ఆయన రోజాపై వ్యాఖ్యానించారు. మిగిలిన తన పాతికేళ్ల జీవితాన్ని రాష్ట్రం కోసం, దేశం కోసం అంకితమిస్తున్నానని చెప్పారు.

ముగ్గురు ముఖ్యమంత్రులు అడ్డుపడితే ప్రత్యేకహోదా గురించి కేంద్ర నాయకులను అడిగితే మూడు రాష్ట్రాల ముఖ్యమంత్రులు అడ్డుపడుతున్నారని అంటున్నారని పవన్‌ కల్యాణ్ ఆగ్రహం వ్యక్తంచేశారు. తెలంగాణ ఇచ్చినప్పుడు ఆరు కోట్ల మంది అడ్డుపడ్డారని ఆయన గుర్తు చేశారు. అయినా అప్పుడు ఇచ్చారు కదా! కేవలం ముగ్గురి కోసం ప్రత్యేక హోదా ఇవ్వడానికి ఎందుకు ఆగిపోతున్నారు? ఎవరి చెవిలో పువ్వులు పెడదామనుకుంటున్నారని ప్రశ్నించారు.
ఢిల్లీలో ఉండే నేతలు చాలా మందికి ఆంగ్లం రాదని, హిందీ మాత్రమేవచ్చునని అంటూ మన ఎంపీలకు హిందీ రాదు. కాబట్టి వాళ్లకు అర్థమయ్యేలా చెప్పలేరు. సార్‌ సార్‌ మేడమ్‌ మేడమ్‌ ప్లీజ్‌.ప్లీజ్‌ అనడం మినహా ఏమీ చెప్పలేకపోతున్నారని ఆయన విమర్శించారు. ఇప్పటికైనా నాలుగు ముక్కలు హిందీ నేర్చుకోవాలని ఆయన ఎంపీలకున సూచించారు.

శేషేంద్ర శర్మను ఉటంకిస్తూ పవన్‌ కల్యాణ్ తన ప్రసంగాన్ని గుంటూరు శేషేంద్ర శర్మను ఉటంకిస్తూ ప్రారంభించారు. పవన్‌ తెలుగు, ఇంగ్లిష్‌, హిందీ భాషల్లో తన ప్రసంగం సాగించారు. ‘ఒక దేశపు సంపద నదులు, అడవులు, ఖనిజాలు కావు కలల ఖనిజాన్ని దోచేసిన యువత దేశ భవిష్యత్తుకు నావికులు’అన్న శేషేంద్ర శర్మ కొటేషనను ప్రస్తావించారు.

కమ్యూనిస్టు ఉద్యమ నేత తరిమెల నాగిరెడ్డి రాసిన ‘తాకట్టులో భారతదేశం’ అనే పుస్తకం తనపై ఎంతగానో ప్రభావం చూపిందన్నారు. ప్రత్యేక హోదా కోసం మంత్రి పదవి పోతే ఏముంది అంటూ అశోక్‌ గజపతి రాజును ప్రశ్నించిన సమయంలో విశ్వవిజేత అలెగ్జాండర్‌ పోతూ పోతూ ఏం తీసుకెళ్లాడంటూ ఒట్టి చేతులు చూపించారని గుర్తు చేశారు. అలాగే తన చేగువేరా అంటే అంతులేని అభిమానమని పవన్‌ చెప్పారు.
మా ఎంపీలు ధనవంతులే కానీ!

ప్రత్యేక హోదా ఇవ్వకపోవడానికి ఏపీ ధనిక రాష్ట్రమని కేంద్రం అనుకుంటున్నదేమోనని పవన్‌ అన్నారు. తమ ఎంపీలు కేశినేని నాని, అవంతి శ్రీనివాస్‌, రాష్ట్ర మంత్రి నారాయణలను చూసి రాష్ట్రంలోని అందరూ ఇలాగే ఉన్నారని అనుకోవద్దని అన్నారు. తమ ఎంపీలు ధనవంతులే. కానీ మా సీమాంధ్ర ప్రజలు మాత్రం పేదవారని అన్నారు. ప్రత్యేక హోదా ఇవ్వకుండా ప్రజలకు ఏమాత్రం న్యాయం జరగదు కేంద్రం ఆలోచించాలని కోరారు.

SHARE

LEAVE A REPLY