పట్టాలెక్కనున్న కొత్త డబుల్ డెక్కర్ కోచ్‌లు!!

0
42

Tmes of Nellore – ✒కోట సునీల్ కుమార్✒ఇండియన్ రైల్వేస్ ప్రయాణిలకు కోసం కొత్త సౌకర్యాలు అందుబాటులోకి తీసుకురాబోతోంది. అధిక స్పీడ్‌తో ప్రయాణించగల డబుల్ డెక్కర్ కోచ్‌లను తయారు చేస్తోంది. రైల్ కోచ్ ఫ్యాక్టరీ కపుర్తల ఇప్పటికే కొత్త డబులు డెక్కర్ కోచ్‌ను డిజైన్ చేసింది. ఇది గంటకు 160 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించగలదు. రైల్వే ప్రయాణికులకు ప్రత్యేకమైన సర్వీసులు అందించాలనే లక్ష్యంతో కూడా ఈ డబుల్ డెక్కర్ కోచ్‌ను తీర్చిదిద్దారు. ఓల్డ్ కోచ్‌లతో పోలిస్తే ఈ కొత్త వాటిలో పలు ప్రత్యేకతలు ఉన్నాయి. ఎక్కువ మంది ప్రయాణించొచ్చు. ఇంకా మోడ్రన్ ఫెసిలిటీలు కూడా పొందొచ్చు. ప్రతి కోచ్‌లో 120 మంది ప్రయాణించొచ్చు. ఇంకా లగేజ్ ర్యాక్స్‌ను ఏర్పాటు చేశారు. మొబైల్ ఫోన్స్, ల్యాప్‌ట్యా్ప్స్ వంటి వాటికి చార్జింగ్ పెట్టుకోవచ్చు. జీపీఎస్ ఆధారిత ప్యాసింజర్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్, ఎల్‌ఈడీ డెస్టినేషన్ బోర్డు వంటి వాటిని కూడా అమర్చారు. ఆటోమేటిక్ స్లైడ్ డోర్స్ ఉంటాయి. ప్రతి కోచ్‌లో ప్యాంట్రీ కూడా ఉంటుంది. దీని ద్వారా హాట్ ఫుడ్, బేవరేజెస్ వంటివి ప్రయాణికులకు లభిస్తాయి.

ప్రయాణికుల భద్రత కోసం స్మోక్ డిటెక్షన్ సిస్టమ్‌ను ఏర్పాటు చేశారు. అలాగే సీసీ టీవీ కెమెరాలు ఉంటాయి. ఇంకా స్మూత్ జర్నీ కోసం స్ప్రింగ్ సస్పెన్షన్ సిస్టమ్‌ను అమర్చారు. దీంతో ట్రైన్ 160 కిలోమీటర్ల వేగంతో వెళ్లినా కూడా ప్రయాణికులకు జర్నీ సాఫీగానే ఉంటుంది.

SHARE

LEAVE A REPLY