జయాబచ్చన్ పైవ్యాఖ్యలకు క్షమాపణ చెప్పిన నరేశ్‌ అగర్వాల్‌

0
97

Times of Nellore(Delhi) – సమాజ్‌వాదీ పార్టీ(ఎస్పీ)ని వీడి భాజపాలో చేరిన నరేశ్‌ అగర్వాల్‌ జయా బచ్చన్‌పై పరోక్షంగా చేసిన వ్యాఖ్యలకు గాను క్షమాపణలు చెప్పారు. తన మాటలు ఎవరినైనా బాధించి ఉంటే క్షమించండి అని విలేకరుల వద్ద తెలిపారు. సమాజ్‌వాదీ పార్టీ అధ్యక్షుడు అఖిలేశ్‌ యాదవ్‌కు అత్యంత సన్నిహితుడైన నరేశ్‌ అగర్వాల్‌ తనకు రాజ్యసభ టికెట్ ఇవ్వలేదనే అసంతృప్తితో ఎస్పీని వీడి నిన్న భాజపాలో చేరిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం రాజ్యసభ సభ్యుడైన నరేశ్‌ పదవీ కాలం ఏప్రిల్‌ 2తో ముగుస్తుంది. అయితే ఈసారి ఎస్పీ రాజ్యసభ టికెట్‌ను నరేశ్‌కు కాకుండా సినీ నటి జయా బచ్చన్‌కు కేటాయించారు. ఈ సందర్భంగా నరేశ్‌ మాట్లాడుతూ పరోక్షంగా జయా బచ్చన్‌పై విమర్శలు చేశారు. ఎస్పీ తనకు టికెట్‌ ఇవ్వకుండా సినిమాల్లో నటిస్తూ డ్యాన్సులు చేసుకునే వారికి టికెట్‌ ఇచ్చిందని, ఇది తనను చాలా బాధించిందని వ్యాఖ్యానించారు.

SHARE

LEAVE A REPLY