సీబీఐ తాత్కాలిక చీఫ్‌గా నాగేశ్వర రావు…?

0
83

Times of Nellore (Delhi)  # కోట సునీల్ కుమార్ #- సీబీఐ తాత్కాలిక చీఫ్‌గా నాగేశ్వర రావును కేంద్ర ప్రభుత్వం గురువారం నియమించినట్లు సమాచారం. తదుపరి ఆదేశాలు జారీ చేసే వరకు ఈ పదవిలో ఆయన కొనసాగనున్నట్లు తెలుస్తోంది.సీబీఐ చీఫ్ పదవి నుంచి అలోక్ వర్మను తొలగించిన నేపథ్యంలో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది.

సెంట్రల్ విజిలెన్స్ కమిషన్ నివేదిక ఆధారంగా ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలోని హైపవర్డ్ కమిటీ అలోక్ వర్మను సీబీఐ చీఫ్ పదవి నుంచి తొలగించాలని నిర్ణయించింది. ఈ కమిటీలో మోదీతోపాటు సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఏ కే సిక్రి, ప్రతిపక్ష నేత మల్లికార్జున ఖర్గే ఉన్నారు. అలోక్ వర్మను సీబీఐ చీఫ్ పదవి నుంచి తొలగించాలన్న నిర్ణయాన్ని మల్లికార్జున ఖర్గే వ్యతిరేకించారు.

SHARE

LEAVE A REPLY