కేదార్నాథ్ ఆలయం మూసివేత!!

0
65

Times of Nellore –✒కోట సునీల్ కుమార్✒హిమాలయాల్లోని కేదార్‌నాథ్ ఆలయాన్ని శీతాకాలం సందర్భంగా సోమవారం నుంచి మూసివేయనున్న నేపథ్యంలో ఇద్దరు ముఖ్యమంత్రులు ఆలయాన్ని సందర్శించి పూజలు చేశారు. ఉత్తరాఖండ్ రాష్ట్ర ముఖ్యమంత్రి త్రివేంద్ర సింగ్ రావత్, ఉత్తరప్రదేశ్ రాష్ట్ర సీఎం యోగిఆదిత్యనాథ్ లు ఆదివారం అర్దరాత్రి కేదార్‌నాథ్ ఆలయాన్ని సందర్శించి ప్రత్యేక పూజలు చేశారు. కేదార్‌నాథ్ ఆలయాన్ని సోమవారం నుంచి మూసివేస్తున్న దృష్ట్యా ఇద్దరు సీఎంలు ఆ కార్యక్రమంలో పాల్గొననున్నారు. ప్రధాని మోడీ ఆదేశం ప్రకారం కేదార్‌నాథ్ ఆలయ పునర్ నిర్మాణ ప్రాజెక్టులో భాగంగా భక్తుల కోసం అతిథి గృహాల నిర్మాణానికి శంకుస్థాపన చేయనున్నారు.

SHARE

LEAVE A REPLY