వాట్సాప్‌ ఛాట్స్‌ మరింత సురక్షితం!

0
150

Times of Nellore (కాలిఫోర్నియా)# కోట సునీల్ కుమార్ #: వాట్సాప్‌ చిట్ ఛాట్‌లు ఇప్పుడు మరింత సురక్షితం కానున్నాయి. దానికోసం ఆండ్రాయిడ్ వినియోగదారులకు ఫింగర్‌ప్రింట్ అథెంటికేషన్‌ ఫీచర్‌ అందుబాటులోకి రానున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఈ కొత్త ఫీచర్‌ టెస్టింగ్ దశలో ఉంది. డబ్ల్యుఏబీటాఇన్ఫో ఈ విషయాన్ని వెల్లడించింది. ‘ఐవోఎస్‌లో ఫేస్‌ ఐడీ, టచ్‌ ఐడీ మీద పనిచేసిన తరవాత ఆండ్రాయిడ్‌ ఓఎస్‌లో ఈ కొత్త ఫీచర్‌ను తీసుకురావడానికి ప్రయత్నాలు మొదలుపెట్టింది’ అని మంగళవారం తెలిపింది. వాట్సాప్‌లో ఫింగర్‌ ప్రింట్ ఫీచర్‌ కొత్త సెక్షన్‌ కింద అందుబాటులోకి రానుంది. ఒకసారి దాన్ని ఎనేబుల్ చేస్తే, ఈ ఛాట్ యాప్‌ పూర్తి సురక్షితంగా మారనుంది. ఒక నిర్దిష్ట సంభాషణకు మాత్రమే కాకుండా మొత్తం యాప్‌ ఇతరులు వినియోగించడానికి వీలులేకుండా లాక్‌ అవుతుందని బీటాఇన్ఫో వివరించింది. భవిష్యత్‌లో ఇది ఆండ్రాయిడ్ యూజర్లకూ అందుబాటులోకి రానుందని తెలిపింది.

SHARE

LEAVE A REPLY