ఎయిమ్స్ లో మాజీ ప్రధాని వాజపేయి ని పరామర్శించిన మోడీ,రాహుల్,అమిత్ షా

0
259

Times of Nellore (Delhi) – ఎయిమ్స్‌లో చేరిన మాజీ ప్రధాని, భాజపా కురువృద్ధుడు వాజ్‌పేయీని పలువురు ప్రముఖులు పరామర్శించారు. కొద్దిసేపటి క్రితమే ప్రధాని నరేంద్ర మోదీ, భాజపా జాతీయ అధ్యక్షుడు అమిత్‌ షా, కేంద్ర మంత్రి జేపీ నడ్డా దిల్లీలోని ఎయిమ్స్‌ ఆస్పత్రికి వెళ్లారు. సాధారణ వైద్య పరీక్షల నిమిత్తం ఆస్పత్రిలో చేరిన వాజ్‌పేయీ ఆరోగ్య పరిస్థితిపై వైద్యులను ఆరా తీశారు. వాజ్‌పేయీకి అందుతోన్న వైద్య సేవలను అడిగి తెలుసుకున్నారు. అలాగే, అంతకు ముందు కాంగ్రెస్‌ అధ్యక్షుడు రాహుల్‌ గాంధీ కూడా వాజ్‌పేయీని పరామర్శించారు.వాజ్‌పేయీ ఆరోగ్యం నిలకడగానే ఉందని ఎయిమ్స్‌ సంచాలకుడు డాక్టర్‌ రణదీప్‌ గులేరియా వెల్లడించారు. ఆయనకు అన్ని వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నట్టు ఓ ప్రకటనలో పేర్కొన్నారు.

సాధారణ వైద్య పరీక్షల్లో భాగంగా వాజ్‌పేయీ ఎయిమ్స్‌లో చేరినట్టు వైద్యులు ధ్రువీకరించిన విషయం తెలిసిందే. ఎయిమ్స్‌ సంచాలకులు డా.రణ్‌దీప్‌ గులేరియా ఆధ్వర్యంలో ఆయనకు వైద్య సేవలు అందిస్తున్నారు. అల్జీమర్స్‌ కొంతకాలంగా బాధపడుతున్న వాజ్‌పేయీ రాజకీయాలకు దూరమై ఇంటికే పరిమితమయ్యారు. పార్టీ వ్యవహారాలకు సైతం ఆయన దూరంగానే ఉంటున్నారు.

SHARE

LEAVE A REPLY