నేడు జాతిని ఉద్దేశించి ప్రసంగించనున్న మోడీ!!

0
37

Times of Nellore –✒కోట సునీల్ కుమార్✒ప్రధాని నరేంద్ర మోడీ ఇవాళ సాయంత్రం 6 గంటలకు దేశ ప్రజలను ఉద్దేశించి ప్రసంగించనున్నారు. మార్చిలో లాక్‌డౌన్ విధించిన నాటి నుంచి పలు మార్లు ప్రధాని మోడీ దేశ ప్రజలను ఉద్దేశించి మాట్లాడిన విషయం తెలిసిందే. దేశ ప్రజలకు తానో విషయం చెప్పనున్నట్లు ప్రధాని మోడీ తన ట్వీట్‌లో వెల్లడించారు. అయితే ఆ ప్రసంగాన్ని అందరూ ఆలకించాలన్నారు. ఏ అంశంపై ప్రధాని మోడీ మాట్లాడుతారో దాని గురించి ఆ ట్వీట్‌లో వెల్లడించలేదు. కానీ కరోనా గురించి ఇటీవల పలుసార్లు మోడీ ప్రసంగించిన విషయం తెలిసిందే. అయితే గత మూడు నెలల నుంచి తొలిసారి ఇవాళ కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 50 వేల లోపు నమోదు అయ్యాయి. కేంద్ర ఆరోగ్యశాఖ ఇవాళ ఉదయం తన ట్వీట్‌లో ఈ విషయాన్ని చెప్పింది. కరోనా వైరస్ సమయంలో ఇప్పటికే ఆరుసార్లు మోడీ దేశ ప్రజలకు సందేశం వినిపించారు. ఈసారి ఇది ఏడవది కానున్నది. 19 మార్చి, 24 మార్చి, 3 ఏప్రిల్‌, 14 ఏప్రిల్‌, 12 మే, 30 జూన్ తేదీల్లోనూ మోడీ జాతిని ఉద్దేశించి ప్రసంగించారు.

SHARE

LEAVE A REPLY