మరొక్కసారి మెగా, నందమూరి స్టార్ హీరోల భారీ వార్ జరుగనుందా…..??

0
166

Times of nellore – ✒కోట సునీల్ కుమార్✒ – మొదటి నుండి మన టాలీవుడ్ ఇండస్ట్రీలో మెగాఫ్యామిలీ మరియు నందమూరి ఫ్యామిలీల మధ్య కొంత కోల్డ్ వార్ జరుగుతూ ఉంటుంది. నిజానికి ఆ ఇద్దరు ఫ్యామిలీల హీరోలు ఎంతో సౌఖ్యంగా మెలిగినప్పటికీ, ఆయా ఫ్యామిలీల అభిమానులు మాత్రం ఎప్పుడూ మాది పైచేయి అంటే మాది పైచేయి అంటూ తరచు వాదిస్తూ ఉంటారు. నిజానికి ఈ వార్ ఇటీవల సోషల్ మీడియా మాధ్యమాల్లో మరింత ఎక్కువ అయిందనే చెప్పాలి.

 

ఇక ప్రస్తుతం మెగాస్టార్ తనయుడు రామ్ చరణ్, హరికృష్ణ తనయుడు ఎన్టీఆర్ హీరోలుగా ఆర్ఆర్ఆర్ వంటి భారీ మల్టి స్టారర్ లో నటిస్తూ మా మధ్య ఎటువంటి పొరపచ్చాలు లేవు, మీరు కూడా ఒకరిపై మరొకరు వాదనలు పెంచుకోవద్దు అని చెప్తున్నప్పటికీ కొందరు మాత్రం అటువంటి వాదనలు ఇప్పటికీ మానడం లేదు. ఇక ప్రస్తుతం కొన్ని టాలీవుడ్ వర్గాల నుండి అందుతున్న సమాచారం ప్రకారం, వచ్చే ఏడాది వేసవి సమయానికి అతి పెద్ద మెగా, నందమూరి బాక్సాఫీస్ వార్ షురూ కానున్నట్లు చెప్తున్నారు. ప్రస్తుతం సైరా నరసింహా రెడ్డి సినిమాలో నటిస్తున్న మెగాస్టార్ చిరంజీవి, దానితరువాత కొరటాల శివ దర్శకత్వంలో ఒక సినిమా చేయనున్న సంగతి తెలిసిందే. అయితే మరికొద్ది రోజుల్లో ప్రారంభం కానున్న ఆ సినిమాను వచ్చే సమ్మర్ కి విడుదల చేసేలా ప్లాన్ చేస్తున్నారట.

ఇక మరోవైపు కేఎస్ రవి కుమార్ తో ఒక సినిమా స్టార్ట్ చేయబోతున్న బాలకృష్ణ, మరొక మూడు నెలలతరువాత బోయపాటి సినిమా కూడా పట్టాలెక్కిస్తారని అంటున్నారు. నిజానికి ఆ సినిమా ఫుల్ స్క్రిప్ట్ ఎప్పుడో రెడీ అయిందని, బాలయ్య సిగ్నల్ కోసం బోయపాటి వెయిటింగ్ అని టాక్. ఇక అన్ని కుదిరితే దానిని కూడా వీలైనంత త్వరగా మొదలెట్టి సమ్మర్ కానుకగా ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని యోచిస్తున్నారట. ఇక ప్రస్తతం మీడియా మాధ్యమాల్లో విపరీతంగా ప్రచారం అవుతున్న ఈ వార్తల్లో నిజానిజాలు ఎంతవరకు ఉన్నాయో తెలియనప్పటికీ, ఒకవేళ నిజమే అయితే మాత్రం, మరొక్కసారి మెగా, నందమూరి ఫ్యాన్స్ మధ్య మాటల యుద్ధం మరింత పెరిగే అవకాశం ఉందని అంటున్నారు సినిమా విశ్లేషకులు….!!

SHARE

LEAVE A REPLY